వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యా-ఉక్రెయిన్ వార్ ఆపడానికి ఎలాన్ మస్క్ ప్లాన్- తీవ్రంగా స్పందించిన జెలెన్ స్కీ..

|
Google Oneindia TeluguNews

రష్యా-ఉక్రెయిన్ మధ్య సాగుతున్న యుద్ధం ప్రారంభమై నెలలు గడుస్తున్నాయి. అయినా ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదు. రష్యాకు వ్యతిరేకంగా పాశ్చాత్యదేశాలతో పాటు ఐరోపా దేశాలు కూడా ఒక్కటై ఉక్రెయిన్ కు సాయంచేస్తుండటంతో ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. మరోవైపు ఉక్రెయిన్ పై అణుదాడి చేసేందుకు కూడా రష్యా అధినేత పుతిన్ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో యుద్ధ నివారణ ప్రయత్నాలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు ఇప్పుడు ప్రపంచ బిలియనీర్ ఎలాన్ మస్క్ కూడా రంగంలోకి దిగారు.
ఎలాన్ మస్క్ ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధాన్ని ముగించే ప్రణాళికపై దృష్టి పెట్టాలని ట్విట్టర్ వినియోగదారులను కోరారు.
దీనిపై ఉక్రెయిన్ వాసులు మండిపడుతున్నారు. అధ్యక్షుడు జెలెన్ స్కీ కూడా ఎలాన్ మస్క్ ట్వీట్ పై మండిపడ్డారు.
ఇంతకీ ఎలాన్ మస్క్ తన ట్వీట్ లో ఏం పెట్టారో తెలిస్తే వీరి ఆగ్రహం మనకు అర్దమవుతుంది.

Elon Musk Tweeted His plan to end ukraine war- Zelensky Responds severely

ఎలాన్ మస్క్ తన ట్వీట్ లో రష్యా తాజాగా ఉక్రెయిన్ లో ఆక్రమించిన ప్రాంతాల్లో ఐరాస పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించారు. "ప్రజల ఇష్టమైతే అవి రష్యాకు వెళ్లిపోతాయి" అని మస్క్ సూచించారు. రష్యా కూడా దీనికే పట్టుబడుతోంది. ఈ ప్రతిపాదనను ఉక్రెయిన్ తో పాటు పాశ్చాత్య దేశాలు కూడా చట్టవిరుద్ధమైనవిగా అభివర్ణిస్తున్నాయి. 2014లో మాస్కో స్వాధీనం చేసుకున్న క్రిమియాను అధికారికంగా రష్యాగా గుర్తించాలని, క్రిమియాకు నీటి సరఫరాకు హామీ ఇవ్వాలని, ఉక్రెయిన్ తటస్థంగా ఉండాలని మస్క్ సూచించారు. ఈ ప్లాన్‌పై 'అవును' లేదా 'నో' అని ఓటు వేయాలని ఆయన ట్విట్టర్ వినియోగదారులను కోరారు.

దీనిపై అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎవరైనా మీ టెస్లా చక్రాలను దొంగిలించడానికి ప్రయత్నించినప్పుడు, అది వారిని కారు లేదా చక్రాలకు చట్టపరమైన యజమానిగా చేయదని, ఇద్దరూ దానికి అనుకూలంగా ఓటు వేశారని చెప్పినప్పటికీ అంటూలిథువేనియా అధ్యక్షుడు గీతానాస్ నౌసేదా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎలాన్ మస్క్ ట్విట్టర్ లో పెట్టిన ట్వీట్ కు స్పందించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మీకు ఏది ఇష్టం, ఉక్రెయిన్ కు మద్దతిచ్చేవాళ్లు, రష్యాకు మద్దతిచ్చే వాళ్లు అంటూ ప్రశ్నించారు. దీంతో మస్క్ ఇరుకునపడ్డారు.

English summary
billionaire elon musk on today put a tweet suggesting a plan to end russia-ukraine war.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X