ప్రతీకారం తీర్చుకుంటాం: ట్రంప్‌కు చైనా హెచ్చరిక
వన్ చైనా పాలసీ విధానాలు మార్చుకోకుంటే ప్రతీకారం తీర్చుకుంటామని చైనాకు చెందిన పత్రిక అమెరికా తదుపరి అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌ను హెచ్చరించింది.
బీజింగ్: వన్ చైనా పాలసీ విధానాలు మార్చుకోకుంటే ప్రతీకారం తీర్చుకుంటామని చైనాకు చెందిన పత్రిక అమెరికా తదుపరి అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌ను హెచ్చరించింది. చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ పత్రిక ఈ హెచ్చరిక జారీ చేసింది.
ఉత్తర కొరియాకు అంత సీన్ లేదు: 'నైస్' అని చైనాకు ట్రంప్ చురక
తైవాన్ అధ్యక్షురాలు హ్యూస్టన్‌లో ఆగిన గంటల్లోనే ఈ హెచ్చరిక జారీ చేసింది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధికారిక పత్రిక పీపుల్స్ డెయిలీనే ఈ పత్రికను ముద్రిస్తుంది.

తైవాన్ అధ్యక్షురాలు త్సెలెంగ్ వెన్ ఆదివారం మధ్య అమెరికా పర్యటనకు వెళుతూ హ్యూస్టన్‌లో ఆగి సీనియర్ రిపబ్లికన్లను కలుసుకొన్నారు. ఆమె తన పర్యటనలో భాగంగా హోండూరస్, నికరగువా, గ్వాటెమాల, ఎల్ సాల్వడార్ దేశాల్లో పర్యటించనున్నారు.
ఇప్పటికే చైనా ఆమెను అమెరికాలోకి అనుమతించవద్దని కోరింది. వన్ చైనా పాలసీలో భాగంగా ఆమె ప్రభుత్వ అధికారులతో భేటీ కాకుండా చూడాలని కోరింది. కానీ టెక్సాస్ గవర్నర్ జార్జ్ అబాట్ ఆమెతో భేటీ అయిన ఫొటోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఆ ఫొటోలో టెక్సాస్ తైవాన్ జెండాలు కూడా ఉన్నాయి.












Click it and Unblock the Notifications