కరోనా స్ట్రెయిన్ టెన్షన్.. ఇంగ్లండ్‌లో లాక్ డౌన్.. ఫిబ్రవరి 15 వరకు: ప్రధాని బోరిస్
కరోనా స్ట్రెయిన్ కలవరపెడుతోంది. వైరస్ బ్రిటన్‌లో బయటపడిన సంగతి తెలిసిందే. దీంతో బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్ వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ప్రకటించారు. లాక్ డౌన్ ఫిబ్రవరి 15వ తేదీ వరకు కొనసాగుతోందని తెలిపారు. దీంతో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని జాన్సన్ చెబుతున్నారు. దాదాపు 56 మిలియన్ ప్రజలు లాక్ డౌన్‌లో ఉండనున్నారు. ఇప్పటికే ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలను మూసివేశారు.
Recommended Video

కరోనా వైరస్ స్ట్రెయిన్ బ్రిటన్‌లో బయటపడ్డ సంగతి తెలిసిందే. దీంతో యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. కరోనా వైరస్ కోసం టీకా ఇంకా రాకపోగా.. కొత్త స్ట్రెయిన్ టెన్షన్ పుట్టిస్తోంది. ఇదీ కరోనా కన్నా వేగంగా వ్యాపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. దేశంలో 38 కరోనా వైరస్ స్ట్రెయిన్ కేసులను గుర్తించారు. ఇవీ రోజు రోజుకు వ్యాపిస్తూనే ఉన్నాయి.
దేశంలో కరోనా వైరస్ స్ట్రెయిన్ కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. కొత్తగా మరో 9 మందికి స్ట్రెయిన్ నిర్ధారణ అయినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో ఇప్పటివరకు దీని బారినపడినవారి సంఖ్య 38కి చేరింది. కేరళలో తొలిసారి ఆరుగురికి స్ట్రెయిన్ సోకినట్లు ప్రభుత్వం తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఒకే కుటుంబంలోని ఐదుగురికి నిర్ధారణ అయింది. వీరిలో రెండేళ్ల చిన్నారి ఉండటం విశేషం.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications