ఆ ఒక్క కారణంతోనే పాక్ తో సీజ్ ఫైర్.. ! అమెరికా వెబ్ సైట్ తో జైశంకర్..!
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ జోరుగా సాగుతోంది. మరో రెండు, మూడు రోజులు ఆగితే పాకిస్తాన్ మెడలు వంచేందుకు అద్భుతమైన అవకాశం లభించింది. అయితే భారత్ అనూహ్యంగా పాకిస్తాన్ తో కాల్పుల విరమణ ప్రకటించేసింది. దీనిపై స్వదేశంలో విమర్శలు కూడా వచ్చాయి. అయినా కేంద్రం మాత్రం సీజ్ ఫైర్ వైపే మొగ్గు చూపింది. ఆ తర్వాత సీజ్ ఫైర్ కు దారి తీసిన కారణాల్ని ఒక్కొక్కటిగా కేంద్రం బయటపెడుతూనే ఉంది.
ఇదే క్రమంలో తాజాగా అమెరికన్ వెబ్ సైట్ పొలిటికోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మన విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ పాకిస్తాన్ తో సీజ్ ఫైర్ కు దారి తీసిన అసలు కారణాన్ని వెల్లడించారు. మే10వ తేదీన ఒకే ఒక కారణంతో ఆపరేషన్ సింధూర్ ఆపేసినట్లు ఆయన తెలిపారు. 10వ తేదీ ఉదయం తాము ఎనిమిది ప్రధాన పాకిస్తానీ వైమానిక స్థావరాలపై దాడి చేసి ధ్వంసం చేశామన్నారు. దీంతో పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చిందన్నారు. అప్పుడు సీజ్ ఫైర్ కు అంగీకరించినట్లు తెలిపారు.

ఉగ్రవాద గ్రూపులకు ఆశ్రయం కల్పించడంలో పాకిస్తాన్ పాత్రపై స్పందిస్తూ.. ముప్పును తొలగించడానికి అవసరమైతే ప్రత్యక్ష సైనిక చర్య తీసుకోవడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. వారు ఎక్కడ ఉన్నారనేది తమకు ముఖ్యం కాదని, వారు పాకిస్తాన్‌లో మూలన దాక్కుంటే అక్కడికి వెళ్లేందుకు కూడా సిద్ధమన్నారు. తద్వారా ఉగ్రవాదాన్ని మూలాల్లోకి వెళ్లి మరీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు జైశంకర్ వెల్లడించారు.

పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని తమ విధానంగా వాడుకోవడంలో ఆరితేరిపోయిన దేశమని, అదే అసలు సమస్య కూడా అని జైశంకర్ తెలిపారు. బ్రస్సెల్స్ పర్యటన సందర్భంగా అమెరికా వెబ్ సైట్ పొలిటికోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాలు యుద్ధం అంచుకు రావడానికి దారితీసిన పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయా అన్న ప్రశ్నకు స్పందిస్తూ...ఉగ్రవాదంపై నిబద్ధతను ఉద్రిక్తతగా భావిస్తే అది కచ్చితంగా తప్పదన్నారు.
-
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్‌కు తాకట్టు -
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
యుద్ధం ఆగిపోయింది. ట్రంప్ సంచలన ప్రకటన -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
ప్రపంచంలోనే తొలి స్థానంలో పాకిస్థాన్.. ఆ ఒక్క విషయంలో.. -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..!












Click it and Unblock the Notifications