వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్: 15ఏళ్ల తర్వాత కలిసిన తల్లీకొడుకు

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. ఫేస్‌బుక్‌లో ఉన్న ఓ ఫొటోను చూసిన మహిళ.. అతడు తన కొడుకు అని గుర్తించింది. కాగా, సుమారు 15ఏళ్ల తర్వాత ఈ తల్లీ కొడుకులు ఫేస్‌బుక్ సాయంతో కలువడం విశేషం.

3ఏళ్ల వయస్సున్న సమయంలో తన కొడుకును తండ్రి కిడ్నాప్ చేసి మెక్సికోకు తీసుకెళ్లాడని, 15ఏళ్ల తర్వాత తాను తన కొడుకును ఫేస్‌బుక్ ద్వారా కలిశానని కాలిఫోర్నియాకు చెందిన ఆ మహిళ చెప్పింది.

ప్రస్తుతం 18ఏళ్లున్న జోనాథన్ తన సోదరుడితో దిగిన చిన్ననాటి ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. తన తల్లి హోప్ హోలాండ్ లేదా సోదరుడి తనను గుర్తిస్తాడనే ఉద్దేశంతో జోనాథన్ ఈ పని చేశాడు.

Facebook did it again! Mother, son reunite after 15 years

గతవారం ఆ ఫోటోను చూసిన హోలాండ్ కన్నీటి పర్యాంతమైంది. తన కొడుకును తిరిగి చూపించిన ఫేస్‌బుక్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ‘నాకు చాలా సంతోషం కలిగింది. ఇదో సుదీర్ఘమైన పయనం' అని జోనాథన్ ఫొటోను చూసిన తల్లి హోలాండ్ తెలిపింది.

తాను వెంటన్ జోనాథన్ ఫేస్‌బుక్ పేజీలోకి వెళ్లి అతనికి ఫోన్ చేశానని, వెంటనే కలవాలని తన కొడుకుకి చెప్పినట్లు తెలిపింది. కాగా, తన పాఠశాల చదువు పూర్తయిన తర్వాత జోనాథన్ తన తల్లి వద్దకు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశాడు.

English summary
In a scene straight from a Bollywood movie, a Facebook photo has helped a Californian woman reunite with her son after 15 years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X