ది బెస్ట్ వర్క్ ప్లేస్ 'ఫేస్ బుక్': యాపిల్ అత్యంత చెత్త అన్న గ్లాస్‌డోర్ సీఈవో..

Subscribe to Oneindia Telugu
  Facebook Is the Best Place to Work in 2018 | Oneindia Telugu

  వాషింగ్టన్: అమెరికాలో ది బెస్ట్ వర్క్ ప్లేస్‌ కంపెనీగా ఫేస్‌బుక్ టాప్ లో నిలిచింది. అంతర్జాతీయంగా చాలా పాపులర్ అయిన ఆపిల్ మాత్రం ఏకంగా 36వ స్థానం నుంచి 84వ స్థానానికి పడిపోయింది.

  ఎంప్లాయిస్ ఛాయిస్ అవార్డుల్లో భాగంగా.. అమెరికాలోని ప్రముఖ వెబ్‌సైట్ గ్లాస్ డోర్ ఈ ర్యాంకింగ్స్ వెల్లడించింది. 'అమెరికాలోని 100 అత్యుత్తుమ పని ప్రదేశాలు' పేరుతో ఆయా కంపెనీల ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ర్యాంకింగ్ విషయంలో వెనుకబడ్డ ఆపిల్ రేటింగ్ విషయంలో మాత్రం 4.3/5 రేటింగుతో టాప్‌లో నిలిచింది.

   Facebook Is the Best Place to Work in 2018: Glassdoor Survey

  ది బెస్ట్ వర్క్ ప్లేస్ జాబితాలో ఫేస్‌బుక్‌ అనంతరం గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌ సంస్థ బెయిన్‌ అండ్‌ కంపెనీ చోటు దక్కించుకుంది. దీని తర్వాత బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌, ఇన్‌-అండ్‌-అవుట్‌ బర్గర్‌, గూగుల్‌లు ఉన్నాయి.

  గ్లాస్‌డోర్‌ సీఈవో రోబర్ట్‌ హన్‌మాన్‌ ఫేస్‌బుక్‌ టాప్ లో నిలవడంపై స్పందించారు. ఉద్యోగులు ఎక్కువ ఫేస్‌బుక్‌లో పనిచేయడానికే మొగ్గుచూపుతున్నారని అన్నారు. ఫేస్‌బుక్‌ పారదర్శక నాయకత్వం, అక్కడి పని ప్రదేశంలో ఉండే వాతావరణం ఇందుకు కారణాలుగా ఆయన చెబుతున్నారు. 2016 నవంబర్‌ 1-2017 అక్టోబర్‌ 22 వరకు ఉద్యోగుల ఫీడ్ బ్యాక్, రేటింగ్, కంపెనీ రివ్యూల ఆధారంగా గ్లాస్‌డోర్‌ ఈ ర్యాంకింగ్స్‌ను రూపొందించింది.

  ఇక టెక్ దిగ్గజం ఆపిల్ అత్యంత చెత్త వర్క్-లైఫ్ బ్యాలెన్స్ ఆఫర్ చేస్తున్నట్లు గ్లాస్ డోర్ వెల్లడించింది. ఈ కారణంగానే ఆపిల్ మరింత కిందకు పడిపోయనట్లు గ్లాస్ డోర్ తెలిపింది. గ్లాస్ డోర్ ర్యాంకింగ్స్ లో మైక్రో సాఫ్ట్ సైతం 39వ స్థానంలో నిలవడం గమనార్హం. ఎస్‌ఏపీ 11వ స్థానం, సేల్స్‌ఫోర్స్‌ 15వ స్థానం, లింక్‌డిన్‌ 21వ స్థానం, అడోబ్‌ 31వ స్థానం, స్పేస్‌ఎక్స్‌ 50వ స్థానంలో నిలిచాయి.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Headquartered in Menlo Park, California, Facebook just topped Glassdoor's Employees' Choice Awards , which features the 100 best places to work in 2018 across the US.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X