Fact Check: చనిపోయింది జోయ అలుక్కాస్ కాదు జోయ అరక్కల్, సోషల్ మీడియాలో ప్రచారంపై కంపెనీ ప్రకటన..

జోయలుక్కాస్ ఫౌండర్ యూఏఈలో చనిపోయారని సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే దీనిపై కంపెనీ స్పందించింది. తమ యాజమాని యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్‌లో చనిపోలేదని స్పష్టంచేసింది. ఎవరో కావాలనే తప్పుడు మేసెజ్ ప్రచారం చేస్తున్నారని.. తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని తెలిపింది.

జోయ అరక్కల్..

జోయ అరక్కల్..

జోయలుక్కాస్ యాజమాని జోయ అలుక్కాస్.. కానీ ఇటీవల యూఏఈలో జోయ్ అరక్కల్ అనే వ్యక్తి చనిపోయాడు. దీంతో జోయలుక్కాస్ యాజమాని చనిపోయారని ప్రచారం జరుగుతోంది. దానిని కంపెనీ యాజమాన్యం ఖండించింది. ఈ మేరకు ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది. జోయలుక్కాస్ ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నది. కానీ కొందరు సోషల్ మీడియాలో జోయ అరక్కల్ చనిపోతే.. జోయ అలుక్కస్ చనిపోయారని ప్రచారం చేస్తున్నారని ఖండిచింది. కావాలనే కన్‌ఫ్యూజ్ చేశారని మండిపడింది.

జ్యువెలరీ షోరూం..

జ్యువెలరీ షోరూం..

జోయలుక్కాస్ దక్షిణ భారతదేశంలో మంచి పేరుగాడించిన బంగారు ఆభరణాల షో రూం. జోయ అలుక్కాస్ యాజమాని.. కానీ కేరళకు జోయ అరక్కల్‌కు కంపెనీతో ఎలాంటి సంబంధం లేదు అని తేల్చిచెప్పింది. కానీ కొందరు ఫేస్ బుక్, వాట్పాప్‌లో ప్రచారం చేయడం సరికాదని పేర్కొన్నది.

రిఫైనరీ...

రిఫైనరీ...

దుబాయ్‌లో జోయ అరక్కల్ (54) ఈ నెల 23వ తేదీన గుండెపోటుతో చనిపోయారు. దీనిని ప్రముఖ పత్రికలు రిపోర్ట్ చేశాయి. ఇతను కేరళలోని వాయనాడుకు చెందిన వారు అని గుర్తించారు. యూఏఈకి చెందిన ఇన్నోవా సంస్థకు మేనేజింగ్ ఎడిటర్‌గా పనిచేసేవారు అని పేర్కొన్నది. సం్థ పెట్రోలియం, పెట్రో కెమికల్ ఉత్పత్తులు తయారు చేసేదని రిపోర్ట్ చేసింది. రిఫైనరి చేసే కంపెనీ ఆఫీసు యూఏఈ, కువైట్, సౌదీ అరేబియా, భారతదేశంలో బ్రాంచీలు ఉన్నాయి. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నాయి.

1987 నుంచి..

1987 నుంచి..

జోయలుక్కాస్ వ్యవస్థాపకులు.. జోయ్ అలుక్కాస్.. 1987లో కంపెనీని ప్రారంభించారు. త్రిసూర్, దుబాయ్‌లో ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. జ్యువెల్లరీ, మనీ ఎక్స్చేంజ్, ఫ్యాషన్, సిల్క్, మాల్స్ ఉన్నాయని తెలిపింది. తప్పడు ప్రచారం చేసినవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+