• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమెరికాకు మరో షాక్! వణికిస్తున్న కార్చిచ్చు, 2 వేల ఎకరాలు బూడిద, స్కూళ్లు మూసివేత

By Ramesh Babu
|

వాషింగ్టన్: నిన్న మొన్నటి వరకు అమెరికాను హరికేన్లు అల్లాడించగా, ఇప్పుడు దావానలం వణికిస్తోంది. వరుస హరికేన్లు.. హార్వే, ఇర్మా, మారియా సృష్టించిన భయోత్పాతం మరువనే లేదు.. తాజాగా 2 వేల ఎకరాల్లో వ్యాపించిన మంటలు స్థానికుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి.

కాలిఫోర్నియాలోని చైనో హిల్స్ స్టేట్ పార్క్‌లో మొదలైన కార్చిచ్చు ఇప్పటికే 1700 ఎకరాలను బూడిద చేసింది. రంగంలోకి దిగిన అత్యవసర సిబ్బంది సమీప ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సోమవారం మొదలైన కార్చిచ్చు ఇప్పటి వరకు 2 వేల ఎకరాలకు వ్యాపించింది.

Fast-moving wildfire burns 2,000 acres, damaging one home as hundreds evacuated

చెలరేగిపోతున్న కార్చిచ్చును ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఓ విమానం సహా 300 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా కార్చిచ్చుపై విమానంతో నీళ్లు కుమ్మరిస్తున్నారు.

మరోవైపు అధికారులు ముందుజాగ్రత్త చర్యలు కూడా తీసుుకుంటున్నారు. దావానలం కారణంగా సమీప ప్రాంతాల్లోని విద్యాలయాలను మూసివేశారు. 11 ప్రాంతాల్లోని ప్రజలను అత్యవసరంగా తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 1500 మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A large wildfire that ripped through a canyon in Southern California on Monday has forced the evacuation of as many as 1,500 residents living around the Santa Ana Mountains near Anaheim. The Canyon Fire, as authorities are calling it, has consumed 2,000 acres of vegetation and is only 5 percent contained, according to the Corona, California, fire department. Helicopters and other aircraft dropped water on the fire all through Monday and the night. Crews used bulldozers and cleared vegetation by hand to try to halt the fire’s advance as gusts of up to 30 miles per hour whipped the flames and shifted the direction of their advance. Authorities reported that only one home was damaged, and they have not reported any injuries. The fire started at about 1 p.m. Monday, and it spread into Chino Hills State Park a couple hours later. The authorities haven’t yet said what first sparked the fire. Four schools have been closed, and residents were told to shelter in the local high school athletics field house. Closed roads caused halted traffic in the area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more