అమెరికాలో భార్యను చంపి పరారీ: భారతీయుడిపై రూ. 2 కోట్ల రివార్డు
వాషింగ్టన్: తొమ్మిదేళ్ల క్రితం తన భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఓ భారతీయుడి తలపై అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) భారీ రివార్డును ప్రకటించింది. అమెరికాలో భార్యను కత్తితో పొడిచి పరారైన నిందితుడు భద్రేశ్ కుమార్ చేతన్ భాయ్ పటేల్‌ను ఎఫ్‌బీఐ టాప్ టెన్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది. తాజాగా, భ్రజేశ్ కుమార్ ఆచూకీ తెలిపిన వారికి 2,50,000 డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 2 కోట్లకుపైనే) ఇస్తామని పేర్కొంది.
2015 ఏప్రిల్ 12న అమెరికా మేరీల్యాండ్‌లోని హానోవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంటుంది. భద్రేశ్ పటేల్, అతడి భార్య పాలక్ స్థానికంగా ఉండే ఓ డోనట్ దుకాణంలో పనిచేసేవారు. హత్య జరిగిన రోజున వీరిద్దరూ నైట్ షిప్ట్‌లో ఉన్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ దుకాణంలోని కిచెన్‌లో పనిచేస్తున్న పాలక్ దగ్గరకు అతడు వెళ్లి పలుమార్లు కత్తితో పొడిచి.. అక్కడ్నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఎఫ్‌బీఐ అధికారులు నిందితుడి కోసం తీవ్రంగా గాలింపు చేపట్టారు. హత్య అనంతరం తన అపార్ట్‌మెంట్‌కు వచ్చిన భద్రేశ్ కుమార్ కొన్ని వస్తువులు తీసుకుని న్యూజెర్సీ ఎయిర్ పోర్టుకు వెళ్లినట్లు సీసీటీవీ దృశ్యాల్లో కనిపించింది. అయితే, ఆ తర్వాత అతడి జాడ తెలియలేదు. అప్పట్నుంచి నిందితుడి కోసం గాలిస్తోంది ఎఫ్‌బీఐ.
The #FBI offers a reward of up to 0,000 for info leading to the arrest of Ten Most Wanted Fugitive Bhadreshkumar Chetanbhai Patel, wanted for allegedly killing his wife while they were working at a donut shop in Hanover, Maryland, on April 12, 2015: https://t.co/tCZ0Fde7WQ pic.twitter.com/GGLK4dBLhA
— FBI Most Wanted (@FBIMostWanted) April 12, 2024
వీసా గడువు తీరడంతో పాలక్ భారత్ తిరిగి వెళ్లిపోవాలని నిర్ణయించుకుందట. అయితే, ఇది నచ్చని ఆమె భర్త ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా ధృవీకరించారు. నిందితుడు భద్రేశ్ కెనడా పారిపోయి ఉంటాడని లేదా భారత్ కు తిరిగి వెళ్లి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. 2017లో అతడ్ని టాప్ టెన్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది. తాజాగా, అతడిపై భారీ రివార్డును ప్రకటించింది.












Click it and Unblock the Notifications