ఆసక్తికరం: అమెరికాలో జాత్యహంకార దాడులు, వారిపైనే అధికమంటోన్న ఎఫ్‌బీఐ నివేదిక

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో జరిగే జాత్యహంకార దాడుల గురించి కొత్తగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ అధిక సంఖ్యలో జాతి విద్వేష దాడులు, కాల్పులు జరగడం సహజంగా మారిపోయాయి.

అయితే ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే... ఈ దాడుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇదే విషయాన్ని అమెరికా భద్రత, గూఢాచార సంస్థ ఎఫ్‌బీఐ కూడా మరోసారి స్పష్టం చేసింది.

FBI report for 2016 sees hate crimes on the rise

ఎఫ్‌బీఐ విడుదల చేసిన ఓ నివేదికలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. 2015తో పోలిస్తే 2016లో అమెరికాలో జాత్యహంకార, విద్వేష దాడులు దాదాపు 5 శాతం మేర పెరిగాయి.

నల్లజాతీయులు, యూదులు, ముస్లిం, ఎల్‌జీబీటీలపై ఈ దాడులు అధికంగా జరిగాయి. 2016లో మొత్తం 4,229 జాతి విద్వేష దాడులు జరగగా అందులో దాదాపు సగంపైగా నల్లజాతీయులపైనే జరిగాయి. శ్లేత జాతీయులపై 20 శాతం జరిగాయి.

మత విద్వేషానికి సంబంధించిన దాడులు కూడా అధిక సంఖ్యలోనే జరిగాయి. అలాగే ఎల్‌జీబీటీలపై కూడా లింగవివక్ష చూపిస్తూ దాడులు జరిగాయని ఎఫ్‌బీఐ పేర్కొంది. తాజాగా అమెరికాలో భారతీయులపై కూడా దాడులు పెరుగుతున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
National hate crime statistics are flawed and incomplete. That's because bias and motivations for crimes aren't always clear, such crimes can be underreported by both victims and police, and even when the available data are compiled by the FBI, they still don't give a fully realized picture of where and how criminal hate is expressed in America.That being said, the data can still give us a general idea of sea changes and shifts in our social animus. For instance, newly released FBI hate crime statistics for 2016 reveal some interesting trends: Reports of hate crimes against Muslims are up, as are hate crimes targeting white people. In fact, in general, hate crimes saw a rise over the year.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి