వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫిఫా ప్రపంచ కప్: పోర్చుగల్‌పై మొరాకో విజయాన్ని ఇస్లాంతో ముడిపెడుతున్నారు ఎందుకు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
తల్లితో బోఫాల్

ఫిఫా ప్రపంచకప్‌లో శనివారం రాత్రి మొరాకో చరిత్ర సృష్టించింది. వరల్డ్ కప్‌లో సెమీఫైనల్‌కు చేరిన తొలి ఆఫ్రికన్ దేశంగా రికార్డు నెలకొల్పింది.

శనివారం దోహాలోని అల్-థమామా స్టేడియంలో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మొరాకో 1-0తో పోర్చుగల్‌ను ఓడించి సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లింది.

క్రిస్టియానో ​​రొనాల్డో, పెపే, బ్రూనో ఫెర్నాండెజ్, బెర్నార్డో సిల్వా, రూబెన్ డయాస్‌ లాంటి దిగ్గజాలు ఉన్న పోర్చుగల్‌ను మొరాకో ఓడించింది. ఇది ఆ దేశానికి పెద్ద విజయం.

మొరాకో స్ట్రైకర్ యూసఫ్ ఆన్-నస్సరీ తొలి అర్ధభాగంలో చేసిన గోల్ జట్టును సెమీ-ఫైనల్‌ వైపుకు నడిపించింది.

మొరాకో విజయంతో అరబ్, ఆఫ్రికా దేశాల్లో సంబరాలు అంబరాన్నంటాయి. 92 ఏళ్ల ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా ఒక ఆఫ్రికన్ దేశం టాప్-4కి చేరుకోవడంతో అంతా వేడుక చేసుకున్నారు.

మొరాకో ఆటగాడు జావేద్ అల్ యమిక్

సంబరాల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, మొరాకో వింగర్ సోఫియానే బౌఫాల్, తన తల్లితో కలిసి మైదానంలో ఆనందంగా డ్యాన్స్ చేస్తున్న దృశ్యం చర్చకు దారితీసింది.

తన తల్లితో ఉన్న చిత్రాన్ని పంచుకుంటూ బోఫాల్ ఇన్‌స్ట్రాగ్రాంలో ఒక పోస్ట్ పెట్టారు.

"అన్నీ ఇచ్చేది దేవుడే, అల్హమదులిల్లా" అని రాశారు.

అంతకుముందు, గ్రూప్ మ్యాచ్‌లో బెల్జియంను ఓడించిన తరువాత, మొరాకో స్టార్ అష్రఫ్ హకీమీ స్టేడియంలో తన తల్లిని కౌగిలించుకున్న వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

గెలవడానికి ఏమాత్రం అవకాశం లేని జట్టుగా మొరాకో ఈ టోర్నమెంటులోకి అడుగుపెట్టింది. ఒక్కొక్క మ్యాచ్ గెలుచుకుంటూ సెమీస్‌కు చేరుకుంది. తమ దేశానికి గుర్తింపు తీసుకొచ్చింది.

ప్రపంచ కప్‌లో ఈ స్థాయికి చేరుకున్న ముస్లిం మెజారిటీ దేశం ఒక్క మొరాకోనే. శనివారం మ్యాచ్ గెలిచిన తరువాత 'అట్లాస్ లయన్' అంటూ జనం చేసిన నినాదాలతో స్టేడియం హోరెత్తిపోయింది. అట్లాస్ లయన్ అనేది ఉత్తర ఆఫ్రికాలో కనిపించే ప్రత్యేక జాతి సింహం. అందుకే మొరాకో జట్టును ఆ పేరుతో పిలుస్తారు.

https://twitter.com/AchrafHakimi/status/1596921100805758978

మొరాకో విజయాన్ని ఇస్లాంతో ముడిపెట్టడంపై చర్చ

మొరాకో జనాభాలో 97 శాతం పైగా ముస్లింలు ఉన్నారు. అరబ్ సున్నీ ముస్లింలు ఎక్కువ సంఖ్యలో ఉన్నందున దీనిని అరబ్-ఆఫ్రికన్ దేశం అని పిలుస్తారు. 7వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం వరకు అరబ్బులు ఈ ప్రాంతాన్ని పాలించారు. అందువల్ల అరబ్ సంస్కృతి మొరాకో సంస్కృతిలో ఇంకిపోయింది. వైశాల్యం పరంగా, ఈ దేశం 7 లక్షల 10 వేల చదరపు కిలోమీటర్ల భూమిలో విస్తరించి ఉంది. దేశ జనాభా దాదాపు మూడున్నర కోట్లు.

https://twitter.com/ImranKhanPTI/status/1601777732815585280

మొరాకో విజయంపై పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేస్తూ, "పోర్చుగల్‌పై విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరినందుకు మొరాకోకు అభినందనలు. తొలిసారిగా ఒక అరబ్, ఆఫ్రికన్ ముస్లిం జట్టు ఫిఫా సెమీఫైనల్‌కు చేరింది. ఈ జట్టు టోర్నీలో మరింత ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నా" అని రాశారు.

https://twitter.com/KhaledBeydoun/status/1601722183189139456

మిచిగాన్‌లోని వేన్ స్టేట్ యూనివర్సిటీలో లా ప్రొఫెసర్ ఖలీద్ బేడౌన్ ట్వీట్ చేస్తూ, "మొరాకో ఒక ముస్లిం దేశం. దాని జనాభాలో 98 శాతం మంది ఇస్లాం మతాన్ని విశ్వసిస్తారు. ప్రతి గోల్, ప్రతి విజయం తరువాత ఆ దేశ ఆటగాళ్లు ప్రార్థన చేస్తూ తల వంచుతారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200 కోట్ల ముస్లిం ప్రజల విజయమిది" అని రాశారు.

https://twitter.com/kshaheen/status/1601737087518396416

అయితే, మొరాకో విజయాన్ని మతంతో ముడిపెట్టకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

"ఈ రోజు ఒక అరబ్ ఆఫ్రికన్ దేశమైన మొరాకో గెలిచింది, ఇస్లాం మతం కాదు. అలా అయితే, 1930ల నుంచి క్రైస్తవ మతం వరల్డ్ కప్ గెలుస్తున్నట్టు అనుకోవాలా?" అంటూ మిడిల్ ఈస్ట్ జర్నలిస్ట్ కరీమ్ షాహీన్ ట్వీట్ చేశారు.

మరోవైపు, పాకిస్తాన్‌లో మొరాకో విజయంపై విపరీతంగా మాట్లాడుకుంటున్నారు. లక్షల్లో ట్వీట్లు చేస్తున్నారు. ఈ అంశం టాప్ ట్రెండ్‌లో ఉంది.

https://twitter.com/M10/status/1601622041404506112

మాజీ జర్మన్ ఫుట్‌బాల్ ఆటగాడు మెసుట్ ఓజిల్ కూడా మొరాకో విజయంపై ట్వీట్ చేశారు.

"గర్వంగా ఉంది. ఎంత గొప్ప జట్టు! ఆఫ్రికన్ ఖండానికి, ముస్లిం ప్రపంచానికి ఇది గొప్ప విజయం. ఆధునిక ఫుట్‌బాల్‌ క్రీడలో కథలు కూడా నిజమవుతాయని నిరూపించిన విజయం. ఇది ఎంతోమందికి ఆశను, బలాన్ని అందిస్తుంది."

https://twitter.com/GadSaad/status/1601777742579924992

డాక్టర్ ఒమర్ సులేమాన్ అనే ట్వీటర్ యూజర్ ఏం రాశారంటే, "మాషాల్లా మొరాకో విజయం పట్ల ఆఫ్రికా గర్విస్తుంది, పాలస్తీనా గర్విస్తుంది! ముస్లింలు గర్వపడుతున్నారు! దీని గురించి మేమందరం గర్విస్తున్నాం. అల్ హమ్దులిల్లా!"

ఈ ట్వీట్‌పై కెనడా విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ గాడ్ సాద్ స్పందిస్తూ, "ఈ రోజు మొరాకో విజయానికి వేడుక చేసుకుంటున్నా. కానీ, నేను ఒక్కసారి కూడా ఇస్లాం గురించి ప్రస్తావించలేదు. మొరాకో విజయాన్ని పాలస్తీనాతో ఎందుకు ముడిపెడుతున్నారు?" అని ప్రశ్నించారు.

మొరాకో విజయంపై దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మాట్లాడుతూ, "అట్లాస్ లయన్స్‌కి అభినందనలు. మీరు మరోసారి అభిమానులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అరబ్ కుటుంబాలకు ఆనందాన్ని పంచారు. మీ దృఢ సంకల్పంతో నేడు ఖతార్‌లో మనం ఒక అసాధారణ విజయం సాధించాం. మన కల మరింత పెద్దదయింది. మనం మరో కొత్త మైలురాయి చేరుకోవాలి" అన్నారు.

గ్రూప్ మ్యాచ్‌లో బెల్జియంపై మొరాకో విజయం సాధించిన తరువాత జట్టులోని పలువురు ఆటగాళ్లు నేలపై సాగిలబడి ప్రార్థన చేశారు. ఈ ఫొటోను చాలా మంది షేర్ చేశారు.

https://twitter.com/Cricktjunoon/status/1596891913566785536

మొరాకో విజయంపై పాలస్తీనాలో సంబరాలు

అల్ జజీరా నివేదిక ప్రకారం, అరబ్ దేశాలతో పాటు పాలస్తీనాలో కూడా మొరాకో విజయానికి సంబరాలు జరుపుకుంటున్నారు. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ చూడడానికి గాజా స్ట్రిప్‌లోని స్పోర్ట్స్ హాల్‌లో వేలాది జనం గుమిగూడారు. వారంతా మొరాకో గెలవాలని కోరుకున్నవారే.

మ్యాచ్ జరుగుతున్నంతసేపు మొరాకోకు అనుకూలంగా నినాదాలు చేస్తూ, చప్పట్లు కొడుతూ, డప్పు వాయిస్తూ ఉత్సాహంగా కనిపించారు. మ్యాచ్ చివరి బెల్ మోగడంతో వేలకొద్దీ పాలస్తీనియన్ అభిమానులు రోడ్ల మీదకు వచ్చారు. వేడుక చేసుకున్నారు.

ఇది ఏ ఒక్క దేశం సాధించిన విజయం కాదని, అరబ్ దేశాలన్నింటి విజయం అని అల్ జజీరా నివేదిక పేర్కొంది.

1990లో కామెరూన్ vs అర్జెంటీనా మ్యాచ్

ఘనా, సెనెగల్ చేయలేనిది మొరాకో చేసింది

ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 22వ స్థానంలో ఉన్న మొరాకో జట్టు ఈ వరల్డ్ కప్‌లో మొదటి నుంచీ షాక్ ఇస్తూనే ఉంది. గ్రూప్ మ్యాచ్‌లో బెల్జియంపై గెలుపు, రౌండ్ ఆఫ్ 16లో 2010 ప్రపంచ ఛాంపియన్ స్పెయిన్‌ను ఓడించడం ద్వారా ప్రేక్షకులను, అభిమానులను ఆశ్చర్యపరిచింది.

ఇంతకుముందు, మూడు ఆఫ్రికన్ దేశాలు కామెరూన్, సెనెగల్, ఘనా ఫిఫా ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాయి. కానీ, ఏ జట్టూ సెమీ ఫైనల్‌కు వెళ్లలేదు.

కామెరూన్: 1990 ఫిఫా వరల్డ్ కప్‌లో కామెరూన్ 1-0తో అర్జెంటీనాను ఓడించింది. అప్పట్లో ఈ గెలుపు అందరినీ ఆశ్చర్యపరిచింది. రొమేనియాను 2–1తో, ఆపై సోవియట్ యూనియన్‌ను 4–0తో ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. అందులో ఇంగ్లండ్‌తో తలపడి, 3-2తో ఓడిపోయింది.

మొరాకో

సెనెగల్: 2002 ఫిఫా వరల్డ్ కప్‌లో సెనెగల్ 1-0తో ఫ్రాన్స్‌ను ఓడించింది. రౌండ్ ఆఫ్ 16లో స్వీడన్‌ను ఓడించింది. క్వార్టర్ ఫైనల్‌లో టర్కీ చేతిలో ఓడిపోయింది.

ఘనా: 2010లో తొలిసారిగా ఒక ఆఫ్రికా దేశం ప్రపంచకప్‌ను నిర్వహించింది. దాంతో, ఆఫ్రికన్ జట్లపై అంచనాలు పెరిగాయి. సెర్బియాపై విజయంతో ఘనా టోర్నీని ప్రారంభించింది. తరువాత, ఆస్ట్రేలియాతో డ్రా, జర్మనీతో ఓటమి ఫలితంగా గ్రూప్‌లో రన్నరప్‌గా నిలిచింది. రౌండ్ ఆఫ్ 16లో అమెరికాపై విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్స్‌లో ఉరుగ్వే తలపడి, 4-2తో స్కోరుతో ఓడిపోయింది.

ఇది కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
FIFA World Cup: Why is Morocco's win over Portugal linked to Islam?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X