న్యూయార్క్ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్ని ప్రమాదం: 12మంది మృతి

Subscribe to Oneindia Telugu

న్యూయార్క్: అమెరికాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. న్యూయార్క్‌లోని బ్రాంక్స్ బరోలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్ బిల్డింగ్‌లో గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 12 మంది మృతిచెందారు. ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా, మంటల్ని ఆర్పేందుకు సుమారు 160 ఫైర్‌ఫైటర్లు వచ్చారు.

Fire in a New York apartment leaves 12 dead

అయితే మంటలు ఎలా వ్యాపించాయో ఇంకా వెల్లడి కాలేదు. మొదటి అంతస్తు నుంచి మూడో అంతస్తు వరకు మంటలు వ్యాపించాయని అధికారులు తెలిపారు. చనిపోయిన 12మందిలో ఓ ఏడాది చిన్నారి కూడా ఉందని చెప్పారు.

ఈ ఘటనపై నగర మేయర్ బిల్ డే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది ఒక విషాదకర ఘటన అని అన్నారు. బాధితులకు సానుభూతి ప్రకటించారు. ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలోని స్కూల్స్, భవనాల నుంచి కూడా ప్రజలు, పిల్లలను తరలించినట్లు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A fire tore through an apartment building in New York's borough of the Bronx late last night, killing at least 12 people including a child, and leaving four others critically injured, the mayor said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి