గ్రీన్‌ఫెల్ టవర్‌లో భారీ అగ్ని ప్రమాదం: 12మంది మృతి, 74మందికి గాయాలు(వీడియో)

Subscribe to Oneindia Telugu

లండన్: ఇంగ్లాండ్ రాజధాని లండన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లండన్ లోని ఎత్తైన భవనాల్లో ఒకటిగా పేరొందిన గ్రీన్ ఫెల్ టవర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

27 అంతస్తుల గ్రీన్‌ఫెల్ టవర్‌లో చాలా ఫ్లాట్లు ఉన్నాయి. కాగా, భవనం మొత్తం మంటలు వ్యాపించాయి. సుమారు 200 మంది చిక్కుకుపోయారని సమాచారం. వారిని రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు.

Fire engulfs a tower block in Latimer Road in West London

అగ్నికీలలు వేగంగా విస్తరిస్తుండటంతో 50 అగ్నిమాపక శకటాలతో 500 మంది సిబ్బంది మంటలార్పేందుకు రంగంలోకి దిగారు. భవనం మొత్తం భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. భవనంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. కాగా, ఈ టవర్‌ను 1974లో నిర్మించారు.

కూలిపోయే ప్రమాదం: 12మంది మృతి, 74మందికి గాయాలు

కాగా, ఎగిసిపడుతున్న అగ్నికీలలకు భవనం చాలా వరకు దెబ్బతింది. మంటల ధాటికి భవనం కూలిపోయేలా కన్పిస్తోందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అదే గనుక జరిగితే.. పెను ప్రమాదం తప్పదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తెల్లవారుజామున ప్రమాదం చోటుచేసుకోవడంతో చాలా మంది భవనంలో చిక్కుకుపోయారు. నిద్రమత్తులో ఉండటంతో పలువురు ప్రమాదం నుంచి బయటపడలేకపోయారు. 12మంది మృతి చెందగా, 74మందికి తీవ్ర గాయాలయ్యాయి. చాలా మందిని ఫైర్ సిబ్బంది రక్షించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

Read in English: Fire engulfs a tower block
English summary
A 27-storey tower block on Latimer Road in west London has been engulfed in a horrifying blaze, with reports saying people have been trapped in flats.
Please Wait while comments are loading...