భారతీయులకు శుభవార్త! ఢిల్లీ నుంచి వాషింగ్టన్ డీసీకి నేరుగా విమానం

అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు శుభవార్త! భారత్ నుంచి అమెరికాకుమరో డైరెక్ట్ విమానం వెళ్తోంది. మన దేశ రాజధాని ఢిల్లీ నుంచి అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీకి నేరుగా తొలి విమాన సర్వీసును ఎయిరిండియా ప్

వాషింగ్టన్: అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు శుభవార్త! భారత్ నుంచి అమెరికాకు
మరో డైరెక్ట్ విమానం వెళ్తోంది. మన దేశ రాజధాని ఢిల్లీ నుంచి అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీకి నేరుగా తొలి విమాన సర్వీసును ఎయిరిండియా ప్రారంభించింది.

తొలి విమానం శుక్రవారం అక్కడి డల్లాస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. దీంతో ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య ప్రయాణం మరింత సులువైనట్లయింది.

First direct Delhi-Washington Air India flight lands at Dulles International Airport

ఇలా భారత్ నుంచి వాషింగ్టన్ డీసీకి వచ్చిన తొలి విమానం ఏఐ 103కి శుక్రవారం వాటర్ క్యాన్లతో సెల్యూట్ చేశారు. అమెరికాలో భారత రాయబారి నవతేజ్ సర్నా, ఎయిరిండియా సీఎండీ అశ్వనీ లొహానీ, కమర్షియల్ డైరెక్టర్ పంకజ్ శ్రీవాత్సవ తదితరులు కూడా ఈ విమానంలో అమెరికా వెళ్లారు.

ఈ ఢిల్లీ-వాషింగ్టన్ డీసీ సర్వీసు కోసం ఎయిరిండియా తన బోయింగ్ 777-200ఎల్ఆర్ విమానాన్ని కేటాయించింది. ఇందులో 238 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. 8 ఫస్ట్ క్లాస్, 35 బిజినెస్ క్లాస్, 195 ఎకానమీ క్లాస్ సీట్లు ఉంటాయి. ఇక ఈ నెల 8, 17 తేదీలలో 321 సీట్లు ఉండే మరో పెద్ద విమానాన్ని కూడా ఎయిరిండియా వాషింగ్టన్ డీసీకి నడిపించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+