వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిల్లరీ గెలిస్తే.. రికార్డులే: 'బిల్ క్లింటన్' అందరిలో ఓ ప్రశ్న

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. డెమోక్రటికి పార్టీ తరఫున హిల్లరీ క్లింటన్ బరిలో నిలిచారు. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కంటే హిల్లరీకే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఓ ప్రశ్న అందరినీ తొలచివేస్తోంది. హిల్లరీ అధ్యక్షురాలిగా ఎన్నికైతే ఆమె భర్త, మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్‌ను ఏమని పిలవాలి అనేది అందరి మదిలో నిండిన ప్రశ్న. ఇప్పటి దాకా ఎప్పుడు అమెరికా అధ్యక్ష పీఠాన్ని మహిళలు చేపట్టలేదు.

హిల్లరీ రికార్డ్

ఇప్పుడు హిల్లరీ గెలిచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఆమె గెలిస్తే రికార్డ్ సృష్టించనున్నారు. తొలి మహిళా అధ్యక్షురాలిగా వైట్ హౌస్‌లోకి అడుగు పెడతారు. మరోవైపు, బిల్ క్లింటన్ గతంలో అధ్యక్షుడిగా పని చేశారు. కాబట్టి వైట్‌హౌస్‌కు రాబోతున్న తొలి మాజీ అధ్యక్షులు అతనే అవుతారు.

First Gentleman? Mr President? What To Call Bill If Hillary Wins?

ఇప్పటి దాకా పురుషులు అమెరికా అధ్యక్షులుగా ఉన్నారు. దీంతో వారి భార్యలను ఫస్ట్ మహిళగా పిలిచారు. హిల్లరీ గెలిస్తే బిల్ క్లింటన్‌ను మిస్టర్ ప్రెసిడెంట్ అని పిలవాలా, ఫస్ట్ జెంటిల్మెన్ అని పిలవాలా అనే ప్రశ్న ఉదయిస్తోంది.

అధ్యక్షురాలికి భాగస్వామిగా రాబోతున్న వారికి స్టేట్ లెవల్లో ఏమని అడ్రస్ చేయాలా అని సందిగ్ధత ఏర్పడిందని, ఇప్పటి దాకా పురుష అధ్యక్ష భాగస్వామికి ఎలాంటి రోడ్ మ్యాప్ లేదని అమెరికన్లు చెబుతున్నారు. దీనిపై ఎవరికి వారు మాట్లాడుకుంటున్నారు.

ఒకసారి అధ్యక్షులు అయితే జీవితాంతం ఆయన అలాగే గుర్తింపు పొందుతారని, ఒకవేళ హిల్లరీ భర్త గతంలో అధ్యక్షులు కాకుంటే మొదటి జెంటిల్మెన్‌గా పిలువబడేవాడని, కానీ అంతకుముందు బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా పని చేయడంతో ఆయన మాజీ అధ్యక్షుడిగానే పరిగణింపబడతారని కొందరు అంటున్నారు.

English summary
Hillary Clinton's possible election next week to America's highest office has raised a sticky question: What's the best way to refer to the president's male spouse?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X