పొట్టి దుస్తులు వేసుకున్నందుకు.. ఎంతలా అవమానించారంటే

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ : ఎక్కడికెళ్లినా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉండాలనేది నేటితరం యువత ఆలోచన. అందుకే ఆహార్యం విషయంలో తోటివారి కంటే భిన్నంగా ఉండడానికి ప్రయత్నిస్తోంది నేటి యూత్. అదే క్రమంలో మార్కెట్ లోకి పోటెత్తుతున్న ఫ్యాషన్స్ ను ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ బ్రాండెడ్ ఫ్యాషన్స్ కు ఐకాన్ గా ఉండే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే ఫ్యాషన్ ఏమాత్రం ఎబ్బెట్టుగా మారినా.. నలుగురిలో నవ్వుల పాలు గాక తప్పడం లేదు. తాజాగా ఫిట్ నెస్ ట్రైనర్ గా పనిచేసే లిజ్ క్రూగర్ అనే మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురయింది. స్నేహితురాలి పెళ్లి కోసం ఓ షార్ట్ అండ్ టైట్ ఫిట్ డ్రెస్ వేసుకెళ్లిన క్రూగర్ కు వివాహానికి హాజరైన ఇతర మహిళలు షాకిచ్చారు.

 Fitness trainer, Liz Krueger, faces scrutiny for wedding outfit

కురచగా, బిగుతుగా ఉన్న క్రూగర్ డ్రెస్సింగ్ ను అక్కడి మహిళలు తప్పుబడుతూ ఆమెపై బీర్ చల్లి అవమానించినట్టుగా ఇన్ స్టాగ్రమ్ ద్వారా తన ఆవేదనను చెప్పుకొచ్చింది క్రూగర్. తనకు ఎదురైన అవమానం మరే ఇతర మహిళకు ఎదురుకాకుండా ఉండడానికి సోషల్ మీడియాలోనే ప్రచారం కూడా మొదలుపెట్టింది క్రూగర్.

క్రూగర్ కైండ్ నెస్ పేరుతో సోషల్ మీడియాలో కనిపిస్తోన్న ఆ పోస్టులో.. ' కొత్తగా ఎవరైనా మహిళలు ఎదురుపడినప్పుడు అకారణంగా వారి పట్ల ద్వేషానికి పోకుండా, సాటి మహిళలుగా ఒకరికొకరు సహకరించుకోవాలని' చెబుతోంది. దీనిపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. మెచ్చుకునే వాళ్లు మెచ్చుకుంటుంటే, విమర్శలను ఎక్కుపెడుతున్నవారు లేకపోలేదు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Liz Krueger, a fitness trainer, is under fire from all sides for recently wearing a short, skin-tight dress to a wedding.As a bride I can see how someone wearing a super tight and short dress to my wedding would be unwanted.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి