వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైవే మీద కుప్పకూలిన విమానం: ఐదుగురు సజీవదహనం

|
Google Oneindia TeluguNews

మెక్సికో: వేల అడుగుల ఎత్తులో ఉన్న విమానం ఒక్క సారిగా ల్యాండింగ్ కావడానికి ప్రయత్నించిన సమయంలో కుప్పకూలిపోయిన సంఘటన అమెరికాలో జరిగింది. ఈ ప్రమాదంలో ఐదు మంది సజీవదహనం అయ్యారని అధికారులు వెల్లడించారు.

బుధవారం ఉత్తర అమెరికాలోని మెక్సికో సిటి నుండి క్వెరెటరోకు ఎం 7 ఎయిరో స్పేస్ ఎల్ పీ అనే చిన్న తరహా విమానం బయలుదేరింది. వేల అడుగుల ఎత్తులో సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ సందర్బంలో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది.

Five Dead in Mexico city as Plane Crashes

విషయం గుర్తించిన పైలెట్ అత్యవసర ల్యాండింగ్ కోసం ప్రయత్నించాడు. ఆ సందర్బంలో విమానం అదుపుతప్పి హైవే మీద నేలను బలంగా డీకొంది. ఈ ప్రమాదంలో విమానం పేలిపోవడంతో అందులో ఉన్న పైలెట్ లతో సహా ఐదుగురు సజీవదహనం అయ్యారు.

విషయం తెలుసుకున్న ఎయిర్ స్పేస్ వింగ్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం వచ్చిందని అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

English summary
The M7 Aerospace LP plane was conducting a test flight when it crashed in the early afternoon on the road between the capital and Queretaro.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X