వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘రోజుకు 15 మందితో సెక్స్ చేయమని బలవంతం చేశారు’ - లండన్‌లో బ్రెజిల్ యువతుల కన్నీటిగాథ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
బ్రెజిల్ యువతుల కన్నీటి గాథ

"ఎక్కడో ఉంటూ సెల్ ఫోన్ ద్వారా మేం చేసేవన్నీ గమనించేవారు. బెడ్ రూంలో ఒక హిడెన్ కెమెరా పెట్టి ఆ వీడియోలను మాకు తెలిసినవాళ్లకు పంపిస్తామంటూ బెదిరించేవాళ్లు. మా పాస్‌పోర్ట్, పత్రాలు, డబ్బు మొత్తం స్వాధీనం చేసుకున్నారు. స్నేహితులను సంప్రదించకుండా అడ్డుకున్నారు. రోజుకు 15 నుంచి 20 మందితో సెక్స్ చేయాలని బలవంతం చేసేవాళ్లు".

ఇది ముగ్గురు బ్రెజిల్ యువతుల కన్నీటి గాథ. వాయువ్య లండన్‌లోని ఒక భవనంలో బానిసల్లా పనిచేస్తున్న వీరిని చివరకు పోలీసులు కాపాడారు.

గత ఏడాది మార్చిలో ప్రారంభమైన ఈ కేసు దర్యాప్తు, ఈ ఏడాది ఆగస్టులో ముగిసింది.

యువతులు ముగ్గురినీ బంధించి వారితో వ్యభిచారం చేయించినట్లు, వాళ్లతో వ్యాపారం చేయించడానికి వేరే ప్రాంతాలకు కూడా తీసుకెళ్లినట్లు 29 ఏళ్ల యువతి షానా స్టాన్లీ, 31 ఏళ్ల హుస్సేన్ ఎడనీ జంట తమ నేరం అంగీకరించింది.

వీరి అకృత్యాలకు బలైన బాధితుల్లో ముగ్గురు బ్రెజిల్ యువతులతోపాటూ ఒక ఇంగ్లిష్ యువతి కూడా ఉన్నారు.

నేరం నిరూపితం కావడంతో ఈ జంటను జైలుకు పంపారు. ఎడనీకి 8 ఏళ్ల 2 నెలలు, స్టాన్లీకి 3 ఏళ్ల 7 నెలల జైలు శిక్ష విధించారు.

ఈ కేసు పూర్తి వివరాలను బీబీసీ న్యూస్ బ్రెజిల్ సంపాదించగలిగింది.

"వాళ్లు నాకు చూపించిన కలలన్నీ పీడకలగా మారాయి" అని బాధితుల్లో ఒకరైన బ్రెజిల్ యువతి చెప్పారు.

లండన్‌లో తాను ఎదుర్కొన్న ఆ భయంకర ఘటనలు, లైంగిక వేధింపుల నుంచి ఆమె ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు.

బాధితుల వివరాలు గోప్యంగా ఉంచేందుకు గాను ఈ కథనంలో వారి పేర్లు బయటపెట్టలేదు.

'నీ మరణ శాసనం నువ్వే రాస్తావ్'

కొన్ని వారాలపాటు చదవాల్సిన ఒక ఇంగ్లిష్ కోర్స్ కోసం స్కాలర్ షిప్ రావడంతో ఈ ముగ్గురు బ్రెజిల్ యువతులు 2020లో ఇంగ్లండ్ వచ్చారు.

ఈ ముగ్గురు యువతులను ఎవరు, ఎలా సంప్రదించారు అనే వివరాలు పోలీసులు ఇవ్వలేదు. మిగతా వివరాలు పోలీసులు వెల్లడించారు.

ఇంగ్లండ్ వచ్చిన కొన్ని రోజులకే వీరు ఒక మానవ అక్రమ రవాణా మార్కెట్‌లో చిక్కుకుపోయారు.

ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం ఏటా దాదాపు 25 లక్షల మందికి పైగా ఇలాంటి వాటిలో చిక్కుకుపోతున్నారు. ఏటా మానవ అక్రమ రవాణా వ్యాపారం 3,000 కోట్ల డాలర్లకు పైగా జరుగుతోంది.

"బాధితులు దైర్యసాహసాలు చూపడం వల్ల... ఎడానీ, స్టాన్లీ వారి నేరాన్ని ఒప్పుకోవడం తప్ప మరో దారి లేనంతగా మేం బలమైన ఆధారాలను సేకరించగలిగాం. వాళ్లు ఇక ఎవరికీ హాని చేయకుండా వీటితో అడ్డుకోవచ్చు" అని ఈ దర్యాప్తు అధికారుల్లో ఒకరైన పీట్ బ్రీస్టెర్ చెప్పారు.

గత ఏడాది మార్చిలో షానా స్టాన్లీతో గొడవపడిన ఓ బాధితురాలు పోలీసుల సాయం కోరడంతో ఇదంతా వెలుగులోకి వచ్చింది.

ఈ గొడవ జరిగినప్పుడు బాధితురాలు పోలీసులకు ఫోన్ చేయాలని ప్రయత్నించారు. కానీ స్టాన్లీ ఆమెను నెట్టేసింది.

తర్వాత "నీ మరణ శాసనాన్ని నువ్వే రాసుకుంటున్నావ్" అని బెదిరించిందని అధికారుల రికార్డుల్లో ఉంది.

దీంతో ఎలాగైనా పోలీసుల నుంచి రక్షణ పొందాలని నిర్ణయించుకున్న బ్రెజిల్ యువతి.. అధికారులకు వారి ఫొటోలను చూపించారు.

ఆ తర్వాత లండన్ పోలీస్‌కు చెందిన ఒక టీమ్ దీనిపై దర్యాప్తు ప్రారంభించింది.

మాంచెస్టర్‌లో తన ఇంగ్లిష్ కోర్స్ మొదలైన కొన్ని రోజులకే స్కాలర్‌షిప్ కోసం చర్చలు జరిపిన మహిళ ఆమెను కలిసేందుకు లండన్ రావాలని తనను ఆహ్వానించిందని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పారు.

ఆ మహిళను కలిసిన తర్వాత ఒక ఒప్పందంపై సంతకం చేయాలని బలవంతం చేశారు. లేదంటే తిరిగి బ్రెజిల్ వెళ్లడం కుదరదని బాధితురాలికి చెప్పారు.

వారు చెప్పినట్లు చేయకపోతే లండన్ వీధుల్లోనే ఉండాల్సి వస్తుందని, ఇక ఎప్పటికీ తన కుటుంబాన్ని చూడలేనని ఆ యువతి భయపడ్డారు.

సంతకం పెడితేనే.. లేకపోతే

ఆ ఒప్పందం ప్రకారం వ్యభిచారం చేయాలని బ్రెజిల్ యువతిని కోరినట్లు పోలీసులు చెప్పారు.

తనకు వేరే దారి లేకుండా పోవడంతో, తిరిగి బ్రెజిల్ వెళ్లలేననే భయంతో ఆ ఒప్పందంపై సంతకం చేశానని ఆమె అధికారులకు చెప్పారు.

మిగతా ఇద్దరు బ్రెజిల్ యువతులకు కూడా అలాగే జరిగింది. ఇంగ్లిష్ కోర్స్ చెప్పిస్తామని, టికెట్ల ఖర్చు భరించడంతోపాటూ, కోర్స్ పూర్తయ్యేవరకూ ఉండడానికి వసతితో కూడా అందిస్తామని హామీ ఇవ్వడంతో వారు కూడా లండన్ వచ్చారు.

వాళ్లు రోజుకు 690 డాలర్లు సంపాదించాల్సి ఉంటుంది. ఫలితంగా వాళ్లకు వారానికి 345 డాలర్లు, తిండి ఖర్చులకు 70 డాలర్లు ఇచ్చేవారు.

"వ్యభిచార ముఠా టార్గెట్‌గా పెట్టిన ఆ డబ్బు సంపాదించడానికి యువతులు రోజుకు 15 నుంచి 20 మందితో బలవంతంగా సెక్స్ చేయాల్సి వచ్చేది" అని పోలీసులు తెలిపారు.

బాధితులు పోలీసులను సాయం అడిగారు

ఆ జంట తాము కంట్రోల్ చేసే కెమెరాలతో ఆ బెడ్ రూంలో జరిగే ప్రతిదాన్నీ చిత్రీకరించేవారు. మేం చెప్పిందల్లా చేయకపోతే ఈ దృశ్యాలను మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పంపిస్తామని బెదిరించేవారు.

తర్వాత బ్రెజిల్ యువతుల మీద వారి నియంత్రణ ఇంకా పెరిగింది.

ముగ్గురు యువతులకు వారి పనిలోకి దిగేముందు సెల్ ఫోన్లు ఇచ్చేవారు. వాట్సాప్ ద్వారా వారి దగ్గరకు రాబోయే క్లైంట్స్ షెడ్యూల్, వారి జీపీఎస్ కదలికల గురించి సమాచారం అందించేవారు.

అప్పుడప్పుడూ మీరు ఇంగ్లిష్ కోర్స్ నేర్చుకోవాలంటూ వారిని బలవంతం చేసేవారు. కానీ కాసేపట్లోనే మళ్లీ అదే పని చేయించేవారు.

బ్రిటన్‌లో వ్యభిచారం చట్టబద్ధమే

బ్రిటిష్ చట్టాలు ఏం చెబుతున్నాయి

బ్రిటిష్ చట్టాల ప్రకారం డబ్బు కోసం వ్యభిచారం చేయడం లేదా లైంగిక సేవలు అందించడం అనేది చట్టబద్ధమే. కానీ, బ్రోకర్లు వ్యభిచార గృహాలు ఏర్పాటు చేసి బలవంతంగా వ్యభిచారం చేయించడం, లైంగిక దోపిడీకి పాల్పడడం నేరం.

ఈ నేరాలకు సంబంధించి తాము కఠినంగా వ్యవహరిస్తున్నట్లు లండన్ పోలీసులు చెబుతున్నారు. ఇందులో ప్రమేయం ఉన్నవారిని కఠినంగా శిక్షిస్తున్నామని, అలాంటి నేరాల గురించి ఫిర్యాదు చేసేలా అందరినీ ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. తమకు అందే ఫిర్యాదులపై దర్యాప్తు చేస్తామని చెప్పారు.

బాధితుల్లో బ్రిటిష్ యువతి

బ్రెజిల్ యువతులు ఫిర్యాదు చేసిన నెల తర్వాత 2020 ఏప్రిల్‌లో లండన్ పోలీసులు వారిని బంధించిన జంట ఇంట్లో తనిఖీలు చేశారు. అక్కడ నుంచి మొబైల్ ఫోన్లు, డాక్యుమెంట్లు, ధరల జాబితాలు, కండోమ్ బాక్సులు స్వాధీనం చేసుకున్నారు.

యువతులతో వ్యభిచారం చేయించిన జంటకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లలో వేల పౌండ్లు ఉండడం గుర్తించారు.

ఈ తనిఖీల్లో ఒక ఇంగ్లిష్ యువతి కూడా వీరి దారుణాలకు బలైనట్లు పోలీసులు గుర్తించారు. మోడలింగ్ ఆశ చూపిన ఏజెంట్లు తనను అందులో ఇరికించినట్లు ఆమె చెప్పారు.

మొదట ఆమెకు విలువైన బహుమతులు, అన్ని ఖర్చులూ చెల్లించిన ఈ జంట తర్వాత ఆమెను తమ బాకీ తీర్చాలంటూ వ్యభిచారంలోకి దించారు.

ఎడనీ, స్టాన్లీ జంట లేనిపోనివి ఆశలు కల్పించి యువతులను తమ దగ్గరకు రప్పించేవాళ్లు. తర్వాత డబ్బు సంపాదన కోసం వారిని వ్యభిచారంలోకి దింపేవాళ్లు.

"వారు ఆ యువతులను, వారి క్షేమాన్ని ఏమాత్రం పట్టించుకునేవారు కాదు. వారితో ఎక్కువ గంటలు బలవంతంగా పనిచేయించేవాళ్లు. ఆరోగ్యం సరిగా లేదని చెప్పినా పట్టించుకునేవారు కాదు. వాళ్లు ఎంత డబ్బు తెచ్చిపెడతారనేదే ఆలోచించేవాళ్లు" అని దర్యాప్తు అధికారి బ్రీస్టెర్ చెప్పారు.

మనల్ని ఎలా రక్షించుకోవాలి

ఐక్యరాజ్యసమితి డ్రగ్స్ అండ్ క్రైమ్ ఆఫీస్(యుఎన్ఓడీసీ) గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మానవ అక్రమ రవాణా కేసుల్లో 72 శాతం మహిళలు, బాలికలే బలవుతున్నారు.

మహిళలకు సంబంధించిన కేసుల్లో 83 శాతం లైంగిక దోపిడీకి సంబంధించినవే ఉంటున్నాయి. 13 శాతం నిర్బంధ కార్మికులు, 4 శాతం మిగతా కేసులు నమోదవుతున్నాయి.

పురుషులలో 82 శాతం మందిని నిర్బంధ కార్మికులుగా ఉంటే, 10 శాతం లైంగిక దోపిడీకి గురవుతున్నారు, ఒక శాతం మందికి అవయవాలు తొలగిస్తుంటే, మిగతా కేసులు ఏడు శాతం ఉంటున్నాయి.

మానవ అక్రమ రవాణా కుంభకోణాల్లో చిక్కుకోకుండా మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి అనే దానిపై అధికారులు ఆరు మార్గాలు సూచించారు.

* ఏదైనా ఉచితంగా ఇస్తామని చెప్పినా, చదువు లేదా ఉద్యోగాల కోసం ఉచిత ప్రతిపాదనలు చేసినా వాటిని సందేహించాలి.

* అలాంటి, ప్రతిపాదనలు వచ్చినపుడు, అధికారిక పత్రాలు అడగాలి. ఒప్పందాలు చదవాలి. ఆ ఆఫర్ ఎవరు ఇస్తున్నారో చూసి దానిపై న్యాయ సలహాలు తీసుకోవాలి.

* ఆ ప్రతిపాదనల్లో ఏవైనా దేశ, విదేశీ ప్రయాణాలు ఉంటే ఇంకా అప్రమత్తంగా ఉండాలి.

* ఎవరైనా తమ వ్యక్తిగత పత్రాలు భద్రంగా ఉంచుకోవాలి.

* మనం ఎక్కడికైనా వెళ్లే ముందు అక్కడి అడ్రెస్, ఫోన్ నంబర్, సిటీ లొకేషన్ వేరే ఎవరితో అయినా షేర్ చేసుకోవాలి.

* ఎప్పుడూ మనకు నమ్మకం ఉన్నవారితోనే ప్రయాణించేలా చూసుకోవాలి.

* ఎక్కడికైనా వెళ్తుంటే అక్కడి కాన్సులేట్స్, పౌరుల కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థలు, ఆ ప్రాంతానికి సంబంధించిన అధికారులు ఫోన్ నంబర్లు, అడ్రస్‌లు నోట్ చేసి పెట్టుకోవాలి.

* వీటన్నిటితోపాటూ కుటుంబంతో, స్నేహితులతో తరచూ మాట్లాడుతుండడం కూడా చాలా ముఖ్యం.

* ఏదైనా జరిగినా, సమాచారం తెగిపోయినా, తమ వారికి ఏదో జరిగిందని, వెంటనే చర్యలు తీసుకోవాలని ఇంట్లో వారు, స్నేహితులు గుర్తిస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
‘Forced to have sex with 15 people a day’ - Tearful tale of Brazilian girls in London
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X