కిమ్‌కు షాక్: ఉత్తరకొరియాపై యుద్దానికి అమెరికా రెఢీ: మైక్ ముల్లెన్ సంచలనం

వాషింగ్టన్: అమెరికా, ఉత్తరకొరియాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్నాయి. ఉత్తరకొరియా అనుసరిస్తున్న విధానాలకు బుద్ది చెప్పేందుకు అమెరికా యుద్దానికి సిద్దం అవుతోందని అమెరికా జాయింట్ చీఫ్ ఆప్ స్టాప్ మాజీ ఛైర్మెన్ మైక్ ములైన్ హెచ్చరించారు.

అమెరికా, ఉత్తరకొరియాల మధ్య ఇటీవల కాలంలో మాటల యుద్దం తీవ్రమైంది. అణు కార్యక్రమాలను కొనసాగిస్తామని ఉత్తరకొరియా తేల్చి చెప్పేసింది. అమెరికా బ్లాక్ మెయిల్ చేసినంత కాలం తమ అణు కార్యక్రమాలను కొనసాగిస్తామని ఉత్తరకొరియా ప్రకటించింది.

కొత్త సంవత్సర సందేశంలో తన టేబుల్‌పై న్యూక్లియర్ బటన్ ఉందంటూ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ చేసిన ప్రకటన ప్రపంచ దేశాలను భయబ్రాంతులకు గురి చేస్తోంది.

ఉత్తరకొరియాపై అమెరికా యుద్దానికి రెఢీ

ఉత్తరకొరియాపై అమెరికా యుద్దానికి రెఢీ

అమెరికా, ఉత్తరకొరియాల మధ్య ఇటీవల కాలంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అణు కార్యక్రమాలకు వెనుకాడబోమని ఉత్తరకొరియా తేల్చి చెప్పేసింది. ఉత్తరకొరియా వ్యవహరశైలితో అమెరికాతో పాటు దాని మిత్రదేశాలు ఆందోళనలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఉత్తరకొరియాపై అమెరికా యుద్దమే మేలని భావిస్తోంది. అమెరికా యుద్ధానికి సిద్ధమవుతోందని యూఎస్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాప్ మాజీ ఛైర్మెన్ మైక్ ముల్లెన్ హెచ్చరించారు.

దౌత్యపరంగా పరిష్కరించుకొనే అవకాశం లేదు

దౌత్యపరంగా పరిష్కరించుకొనే అవకాశం లేదు

దౌత్యపరంగా ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న సమస్యను పరిష్కరించుకొనే వీలు లేదని యూఎస్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాప్ మాజీ ఛైర్మెన్ మైక్ ముల్లెన్ హెచ్చరించారు.గతంతో పోలిస్తే ఉత్తరకొరియాతో యుద్దానికి అమెరికా మరింత చేరువ అవుతోందని మైక్ అభిప్రాయపడ్డారు.

 ఉత్తరకొరియాను నాశనం చేస్తాం

ఉత్తరకొరియాను నాశనం చేస్తాం

ఐక్యరాజ్యసమితి సమావేశంలో ప్రసంగించిన ట్రంప్ ఉత్తరకొరియాను నాశనం చేస్తానని హెచ్చరించాడు.ఉత్తరకొరియాతో యుద్దం చేయడం మినహ మరో మార్గం లేదనే అభిప్రాయాన్ని ఆ సమావేశంలో ట్రంప్ వ్యక్తం చేశారు.అప్పటి నుండి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిపోయాయి.

 అణుశక్తిలో అమెరికాకు ధీటుగా

అణుశక్తిలో అమెరికాకు ధీటుగా

అణుశక్తిలో అమెరికాకు ధీటుగా ఎదగాలని ఉత్తరకొరియా భావిస్తోంది. ఈ మేరకు ఉత్తరకొరియా ప్రయత్నాలను చేస్తోంది. కొత్త సంవత్సరం సందేశంలో కూడ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ఇదే విషయాన్ని ప్రకటించారు. అణుశక్తి సామర్థ్యాలను మరింత పెంచుకొంటామని ఆయన ప్రకటించారు. ఈ మేరకు అవసరమైన పరీక్షలకు సిద్దమని ప్రకటించింది ఉత్తరకొరియా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+