
గాడిద ఎప్పుడూ గాడిదే-జీబ్రా కాదు-పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ కామెంట్స్ వైరల్
పాకిస్తాన్ ప్రధానిగా ఉంటూ అవిశ్వాస తీర్మానం ఎదుర్కొని రాజీనామా చేసిన ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు బ్రిటన్ లో ప్రవాస జీవితం గడుపుతున్నారు. గతంలో పాకిస్తాన్ కు చెందిన పలువురు మాజీ ప్రధానులు కూడా ఇలాగే పదవులు కోల్పోయిన తర్వాత బ్రిటన్ వెళ్లిపోయి ప్రవాస జీవితాలు గడిపిన వారే. ఇదే కోవలో ఇప్పడు బ్రిటన్ లో ఉంటున్న ఇమ్రాన్ ఖాన్ పై ప్రత్యర్ధులు సెటైర్లు వేస్తున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇమ్రాన్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బ్రిటన్‌లో ఉంటున్నట్లు చేసిన వ్యాఖ్యతో మరోసారి నెటిజన్ల దృష్టిని ఆకర్షించారు. కంటెంట్ సృష్టికర్తలు జునైద్ అక్రమ్, ముజమ్మిల్ హసన్, తల్హాతో జరిగిన పోడ్‌కాస్ట్‌లో ఇమ్రాన్ ఖాన్ తన బస గురించి చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ పాడ్‌క్యాస్ట్ స్నిప్పెట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఇందులో ఆయన చేసిన వ్యాఖ్యలు తనపైనే వేసుకున్న సెటైర్లు కూడా కనిపించాయి.

పోడ్‌కాస్ట్‌లో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ యూకేలో ఉన్నప్పుడు తన అనుభవాల్ని పంచుకున్నారు. "నేను యూకేలో నాకు చాలా మంచి స్వాగతం లభించింది. కానీ నేను దానిని సొంత ఇల్లుగా ఎప్పుడూ భావించలేదు" అని చెప్పారు. "నేను ఎప్పుడూ మొదట పాకిస్థానీనే. మీరు దానిపై గీతలు వేస్తే గాడిద జీబ్రాగా మారదు. ఒక గాడిద గాడిదగానే మిగిలిపోయింది" అన్నారాయన. ఈ స్నిప్పెట్‌ను హసన్ జైదీ ట్విట్టర్‌లో పంచుకున్నారు.
Without comment. pic.twitter.com/l0Jwpomqvp
— Hasan Zaidi (@hyzaidi) May 6, 2022
ఇమ్రాన్ వ్యాఖ్యలు పాకిస్తాన్ గురించి చేసినవే అన్న వాదన వినిపిస్తోంది. అయితే ఆయన వ్యాఖ్యలపై స్పందించిన ఓ పాకిస్తాన్ జాతీయుడు ప్రస్తుత ప్రధాని షాబాజ్ షరీఫ్ మమ్మల్ని బిచ్చగాళ్లన్నాడు. ఇమ్రాన్ గాడిదలంటున్నాడు. పాకిస్తాన్ కు ఇలాంటి నేతల్ని అందించినందుకు భగవంతుడికి ధన్యవాదాలు అంటూ ఓ ట్వీట్ చేసారు. మరికొందరు తమ ట్వీట్లలో ఇమ్రాన్ తనను తాను గాడిద అన్నాడా లేక పాకిస్తాన్ దేశాన్ని గాడిద అన్నాడా లేక ప్రజల్ని అన్నాడా అని ప్రశ్నిస్తున్నారు.