వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొడుకును రప్పించి లాడెన్ ఆచూకీ ఇలా, భార్య అడ్డుకొన్నా లాడెన్ ను చంపామిలా: రాబర్ట్

ప్రపంచాన్ని గడగడలాడించిన ఉగ్రవాది ఒసామాబిన్ లాడెన్ ను కాల్చి చంపింది తానేనంటూ ప్రకటించిన రాబర్ట్ . ఒసామా బిన్ లాడెన్ ఏ రకంగా చంపారనే విషయాన్ని ఆయన 'ది ఆపరేటర్ 'అనే పుస్తకంలో వివరించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: ప్రపంచాన్ని గడగడలాడించిన ఉగ్రవాది ఒసామాబిన్ లాడెన్ ను కాల్చి చంపింది తానేనంటూ ప్రకటించిన రాబర్ట్ . ఒసామా బిన్ లాడెన్ ఏ రకంగా చంపారనే విషయాన్ని ఆయన 'ది ఆపరేటర్ 'అనే పుస్తకంలో వివరించారు.

అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామాబిన్ లాడెన్ ను మట్టుబెట్టేందుకుగాను అమెరికా అనేక రకాల ప్రయత్నాలను చేసింది. చివరకు 2011 మే 2వ, తేదిన పాకిస్తాన్ లోని అబోత్తాబాద్ లోని రహస్య గృహంలో లాడెన్ ను హత్య చేసినట్టుగా రాబర్ట్ ప్రకటించారు. లాడెన్ ను చంపింది తానేనని 2014 లో లాడెన్ ను చంపిన విషయాన్ని రాబర్ట్ బయటపెట్టాడు.

లాడెన్ ను ఏ రకంగా చంపారనే విషయమై రాబర్ట్ ఓ పుస్తకాన్ని రచించారు.లాడెన్ ను చంపేందుకు ఎన్ని రకాలుగా ప్లాన్స్ వేశాం, ఏ రకంగా ఆ ఇంటికి చేరాం. లాడెన్ ను ఎలా చంపామనే విషయమై రాబర్ట్ వివరించాడు.

లాడెన్ కు అత్యంత సమీపంగా ఎవరు వెళ్ళారు, లక్ష్యాన్ని ఎలా ఛేదించారు. అడ్డంకులను ఎలా తొలగించుకొంటూ వెళ్ళారనే విషయాలను ఆయన ఆ పుస్తకంలో వివరించారు.

లాడెన్ ఇంటికి ఇలా చేరాం

లాడెన్ ఇంటికి ఇలా చేరాం

ఉగ్రవాదుల ఏరివేతకు సంబంధించి నాలుగు వందలకు పైగా ఆపరేషన్లలో పాల్గొన్నట్టుగా రాబర్ట్ చెప్పారు. లాడెన్ ను వేటాడే బృందంలో తాను ఉన్నట్టు ఆయన చెప్పారు. లాడెన్ ఎక్కడ దాక్కొన్నాడో పక్కా సమాచారం అందిన విషయాన్ని ఆయన ఆ పుస్తకంలో రాశారు.ఖచ్చితమైన సమాచారం ఆధారంగా లాడెన్ దాచుకొన్న ఇంటికి చేరుకొన్నట్టు ఆయన చెప్పారు.

అంచెలంచెలుగా రక్షణ వ్యవస్థ

అంచెలంచెలుగా రక్షణ వ్యవస్థ

లాడెన్ నివాసం ఉంటున్న ఇంట్లో అంచెలంచెలుగా రక్షణ వ్యవస్థ ఉంది. ఒక్కో అంచెను చేధిస్తూ వెళ్ళినట్టు ఆ పుస్తకంలో రాశాడు రాబర్ట్.లాడెన్ నివాసం ఉంటున్న ఇంటి చుట్టూ భారీ ప్రహారీగోడ ఉంది. ఎక్కడ ఎవరు ఎలా ఏం చేయాలనే విషయమై ముందుగానే ప్లాన్ చేసుకొన్నట్టుగా రాబర్ట్ రాశాడు. లాడెన్ నివాసం ఉండే ప్రాంతంలో రక్షణ వ్యవస్థ అడ్డుతొలగించుకొంటూ వెళ్ళేందుకు ప్లాన్ చేసుకొన్నట్టు చెప్పారు.అన్ని వ్యవస్థలను దాటుకొంటూ లాడెన్ గదికి సమీపంలోకి చేరుకొన్నట్టు రాబర్ట్ చెప్పారు.

ఇనుపగేట్ దాటితే లాడెన్ కన్పిస్తాడనుకొన్నాం

ఇనుపగేట్ దాటితే లాడెన్ కన్పిస్తాడనుకొన్నాం

లాడెన్ ఇంటి ప్రహారీగోడ నుండి అన్ని రక్షణ వ్యవస్థలను దాటుకొంటూ ఇనుపగేట్ వద్దకు చేరుకొన్నాం. అయితే ఇనుపగేట్ ను చేధిస్తే లాడెన్ కన్పిస్తాడని భావించాం. అయితే ఇనుపగేట్ పేల్చేస్తే అడ్డుగోడ కన్పించింది. దీంతో నిరాశ చెందాం.శత్రువులను పక్కదారి పట్టించేందుకు లాడెన్ ఆ ఇనుపగేటును ఏర్పాటు చేశాడని అర్థమైంది. ఇలాంటి వ్యూహాత్మక ఏర్పాటు చేశాడంటే లాడెన్ అక్కడే ఉన్నాడని ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చినట్టు ఆయన చెప్పారు.

కొడుకు ఉన్న గది పైనే లాడెన్ నివాసం

కొడుకు ఉన్న గది పైనే లాడెన్ నివాసం

ఇనుప గేటును దాటి గోడను పేల్చివేసి ఒక్కో గదిని దాటుకొంటూ వెళ్ళాం, ఆ గదుల్లో మహిళలు, పిల్లలూ ఉన్నారు. లాడెన్ ఏ గదిలో ఉన్నాడో సమాధానం కావాలంటే లాడెన్ కొడుకు ఖలీద్ ను గుర్తించాల్సి ఉంది. అయితే తమకున్న సమాచారం మేరకు ఖలీద్ ఎక్కడుంటే లాడెన్ అక్కడుంటారు. లాడెన్ ఉండే గదికి కింద ఖలీద్ ఉంటాడని వేగుల ద్వారా తమకు సమాచారం ఉందని రాబర్ట్ చెప్పారు.ఈ మేరకు ఖలీద్ ను గుర్తించేందుకు పక్కా ప్లాన్ వేశాం.

ఖలీద్ ను బయటకు రప్పించామిలా

ఖలీద్ ను బయటకు రప్పించామిలా

ఖలీద్ ను పిలిచేందుకు అరబ్బీ, ఉర్థూ భాషల్లో సహజంగా ఉండేలా ఖలీద్ ను పిలవాలి.అయితే ఈ మేరకు ఖలీద్ ను పిలిచేందుకు తమ బృందంలో ఓ సభ్యుడికి శిక్షణ ఇచ్చాం. అత్యంత సహాజరంగా ఖలీద్ ముస్లింలు పిలిచినట్టుగానే పిలిచేలా తర్పీదు ఇచ్చాం. ఖలీద్ ను అరబ్బీ, ఉర్థూ భాషల్లో ఉండేలా పిలిచాం. ఈ పిలుపుకు స్పందించిన ఖలీద్ ఏమిటంటూ తల బయటకు పెట్టాడు.అయితే ఖలీద్ ను కాల్చిపారేశామని రాబర్ట్ ఆ పుస్తకంలో రాశాడు.

రెండు గదుల్లో లాడెన్ ఎక్కడున్నాడో వెతుకుతూ వెళ్ళాం

రెండు గదుల్లో లాడెన్ ఎక్కడున్నాడో వెతుకుతూ వెళ్ళాం

ఖలీద్ ను చంపగానే పై అంతస్థులోనే లాడెన్ ఉంటాడని పై అంతస్థుకు వెళ్ళాం. రెండు గదులున్నాయి. అయితే ఇద్దరు మహిళలు ఎదురుపడ్డారు. మానవబాంబులు కావచ్చనే అనుమానంతో తమ బృందం సభ్యుడు వారిపై దూకాడు.అయితే వారు మానవ బాంబులు కాదు.అయితే గదిలోకి ప్రవేశించగానే తమకు టార్గెట్ కన్పించింది.అయితే లాడెన్ చిన్న భార్య ఆయనను కాపాడే ప్రయత్నం చేసింది.లాడెన్ కు ఆమె అడ్డుగా నిలిచింది. ఆమెకు బుల్లెట్ తగలకుండా లాడెన్ ను తలలో కాల్చినట్టు రాబర్ట్ చెప్పారు.అతను చనిపోయాడో లేదోనని పేలిన తలలోకి మరో బుల్లెట్ దించినట్టు రాబర్ట్ చెప్పాడు.

English summary
Robert O’Neill, who claims to have fired the fatal bullets, has for the first time published a detailed account of the mission that lead to the 9/11 mastermind being gunned down in a secure compound in Abbottabad, Pakistan, in May 2011.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X