• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ కొత్త పార్టీ?: పేరు ఖరారు: టార్గెట్ 2024: బిడెన్‌‌ కంటి మీద కునుకు లేకుండా స్కెచ్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఏం చేస్తున్నారు?, శేష జీవితాన్ని ఆయన ఎలా గడపబోతోన్నారు?, రాజకీయాల నుంచి శాశ్వతంగా విరమించినట్టేనా? అనే ప్రశ్నలకు కొత్త సమాధానం లభిస్తోంది. అమెరికా రాజకీయాల్లో పునఃప్రవేశించడంపై ఆయన పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. కొత్తగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే దిశగా త్వరలో ఆయన సన్నాహాలు మొదలు పెట్టొచ్చని అంటున్నారు.

Recommended Video

#TopNews : #JoeBiden Takes Oath As 46th President Of The United States | Oneindia Telugu

ట్రంప్ వైట్‌హౌస్‌ను వీడిన వేళ..జో బిడెన్ సంచలన ట్వీట్: దిసీజ్ యువర్ టైమ్: ఒబామాట్రంప్ వైట్‌హౌస్‌ను వీడిన వేళ..జో బిడెన్ సంచలన ట్వీట్: దిసీజ్ యువర్ టైమ్: ఒబామా

పేట్రియాట్ పార్టీ పేరుతో ఓ కొత్త పక్షాన్ని ప్రారంభించే అవకాశాలను ఆయన పరిశీలిస్తున్నట్లు సమాచారం. డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా దాన్ని తీర్చిదిద్దాలనే పట్టుదలతో ఆయన ఉన్నారని అంటున్నారు. వాషింగ్టన్‌లో హింసాత్మక పరిస్థితులకు దారి తీసిన అమెరికా పార్లమెంట్ భవనంపై డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుల నిర్వహించిన దాడి అనంతరం ట్రంప్.. కొత్త పార్టీని ఏర్పాటు చేయాలనే భావనలో ఉన్నట్లు అమెరికన్ మీడియా అభిప్రాయపడింది.

Former US President Donald Trump mulls floating Patriot Party after White House exit: Report

అమెరికా వ్యాప్తంగా వేలాదిమంది తనకు అండగా నిలవడం, ఏకంగా పార్లమెంట్ భవనంపైనే దండెత్తడం వంటి పరిణామాలను చూసిన తరువాత.. కొత్త పార్టీ పెట్టేలా చర్యలు తీసుకుంటున్నారని, దీనికోసం కొంతమంది రిపబ్లికన్ పార్టీ సెనెటర్లు, తన మద్దతుదారులతో సంప్రదింపులు జరిపినట్లు తెలిపింది. అమెరికా వ్యాప్తంగా కోట్లాదిమంది తన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని డొనాల్డ్ ట్రంప్ అంచనా వేస్తున్నట్లు అక్కడి మీడియా స్పష్టం చేసింది.

తనకంటూ ప్రత్యేకంగా ఓ బలమైన ఓటుబ్యాంకు ఉండటం వల్ల కొత్త పార్టీని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే అభిప్రాయాన్ని ట్రంప్.. కొంతమంది రిపబ్లికన్ పార్టీ సెనెటర్లతో పంచుకున్నారనే ప్రచారం అమెరికాలో జోరుగా సాగుతోంది. డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా పేట్రియాట్ పార్టీని తెర మీదికి తీసుకుని రావడంతో పాటు 2024లో జరగబోయే ఎన్నికల్లో పోటీలో నిల్చొవాలనే లక్ష్యంతో దాన్ని బలోపేతం చేయడానికి అందుబాటులో గల అవకాశాలను ట్రంప్ పరిశీలిస్తున్నట్లు మీడియా అంచనా వేసింది.

మరోవంక- డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌ను వీడే సమయంలో చేసిన ప్రసంగంలో కొత్త పార్టీ గురించి పరోక్షంగా ప్రస్తావించారని అమెరికన్ మీడియా పేర్కొంది. ఏదో ఒక రూపంలో తాను అమెరికన్లకు దగ్గరగా ఉంటానని, వారికి సేవ చేస్తానంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం వెనుక గల కారణం.. కొత్త పార్టీ పెట్టాలనే యోచనేనని స్పష్టమౌతున్నట్లు అంచనా వేసింది. కొత్త ప్రభుత్వం కుదురుకున్న వెంటనే తన పార్టీ పేరును ప్రకటించాలని ట్రంప్‌ భావిస్తున్నట్లు పేర్కొంది.

English summary
Former US President Donald Trump contemplated the possibility of launching a new political party called the "Patriot Party" after he leaves the White House on January 20. Search interest for terms like “Third Party,” “New Party,” or “Patriot Party” the name Trump has reportedly floated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X