జో బిడెన్ టీంలో భారత సంతతి వైద్యుడు: ప్రజారోగ్యంపై మూర్తి సలహాలు, కీలక పాత్ర..
అగ్రరాజ్య అధినేతగా జో బిడెన్ ఎన్నికయ్యారు. అయితే ఆయన ఎన్నికలో భారత సంతతికి చెందిన వైద్యుడు డాక్టర్ వివేక్ మూర్తి కీలక పాత్ర పోషించారు. ఆయన బరాక్ ఒబామా హయంలో జనరల్ సర్జన్‌గా నియమితులయ్యారు. ఇప్పుడు బిడెన్ నేతృత్వంలో కీలకమైన వైద్యారోగ్య రంగంలో పరిపాలకుడిగా పనిచేయబోతున్నారు. అయితే అంతకుముందు ఎన్నికలకు సంబంధించి బిడెన్‌తో కలిసి వ్యుహ రచన చేసి.. అమెరికన్ల నాడీ పట్టుకున్నారు.

కరోనా వైరస్ సందర్భంగా పరిపాలనలో కీలక సూచనలను మూర్తి చేశారు. గత కొన్ని నెలలుగా వైరస్‌ను ఎదుర్కొనే అంశంపై బిడెన్‌కు సలహాలిస్తూ వస్తోన్నారు. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ డాక్టర్ డేవిడ్ కెస్లెర్ కూడా బిడెన్ బృందంలో ఉన్నారు. వీరిద్దరూ కీ రోల్ పోషించారని న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. మూర్తితో వారానికి నాలుగుసార్లు వైద్యారోగ్యంతో మాట్లాడేవారని వివరించింది.
కర్ణాటకలోని మాండ్య జిల్లాకు చెందిన మూర్తి.. 2015లో యూఎస్ జనరల్ సర్జన్‌గా నియమిులయ్యారు. 37 ఏళ్ల వయస్సులోనే పదవీకి ఎన్నికయ్యారు. ట్రంప్ ఎన్నికయ్యాక వెళ్లిపోవాలని కోరింది. దీంతో పదవీ నుంచి తప్పుకున్నారు. కానీ బిడెన్ ప్రచారంలో ముఖ్యభూమిక పోషించారు.
ఇదివరకు ఒబామా అధ్యక్షుడిగా ఉండగా.. బిడెన్ ఉపాధ్యక్ష పదవీని చేపట్టారు. డెలావర్‌కు సెనేటర్‌గా కూడా పనిచేశారు. ఇక కమలా హ్యరిసి తొలి మహిళ ఉపాధ్యక్షురాలిగా నిలవబోతున్నారు. అలాగే తొలి నల్ల జాతీయురాలు.. అత్యున్నత పదవీని చేపట్టనున్నారు. ఈ మేరకు సీఎన్ఎన్ రిపోర్ట్ చేసింది.












Click it and Unblock the Notifications