ఫ్లోరిడా నైట్ క్లబ్‌లో కాల్పులు, ప్రాణాలతో బయటపడ్డ కమెడియన్ కూతురు

Posted By:
Subscribe to Oneindia Telugu

ఫ్లోరిడా: ఫ్లోరిడా: ఫ్లోరిడాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. ఓ అగంతకుడు నైట్ క్లబ్‌లో జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. దాదాపు పదిహేడు మంది వరకు గాయపడ్డారు. నగరంలోని క్లబ్ బ్లూ సిటీలో ఈ ఘటన జరిగిందని పోలీసులు చెప్పారు.

క్లబ్‌ బ్లూలో టీన్‌ నైట్ కార్యక్రమం జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. తుపాకీ చేతబూనిన ఓ వ్యక్తి క్లబ్‌లోకి ప్రవేశించిన వెంటనే జనంపైకి కాల్పులు జరపడం ప్రారంభించాడు. అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత ఈ ఘటన జరిగింది. క్లబ్‌ పరిసరాల్లో మొత్తం మూడు చోట్ల కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి.

Fort Myers Nightclub Shooting: 1 Dead, 14 Others Reportedly Wounded

ఒకరే అన్ని చోట్లా కాల్పులకు పాల్పడ్డారా లేక ఎక్కువ మంది దుండగులు ఉన్నారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. తొలుత క్లబ్‌ వద్ద, రెండోది, మూడోదీ సమీపంలోని జంక్షన్‌లో చోటు చేసుకున్నాయి. ఎస్యూవీలో వచ్చి కాల్పులు జరిపారని తెలుస్తోంది.

ఈ కాల్పుల ఘటన నుంచి కమెడియన్ సైరిటా గ్యారీ కూతురు బయటపడ్డారు. దీనిపై ఆమె మాట్లాడుతూ.. దేవుడి దయవల్ల తన కూతురు బయటపడిందని, తన స్నేహితురాలి కాలికి బుల్లెట్ దిగిందని, ప్రాణాలు దక్కించుకునేందుకు అలాగే పరుగు పెట్టిందని చెప్పారు. కాగా, నిందితుడిని ఒకరిని అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది.

తాజా, దాడితో ఫ్లోరిడాలో నెల రోజుల్లో ఇది రెండో దాడి. జూన్ 12వ తేదీన 29 ఏళ్ల వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 49 మంది మృతి చెందారు. ఇదే రాష్ట్రంలోని ఓర్లాండోలో నైట్ క్లబ్‌లోనే ఈ దారుణం జరిగింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Two people were killed and 17 others injured during a shooting at a nightclub in Fort Myers, Florida, on Sunday (July 24) night.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి