గాలిలో రెండు విమానాలు ఢీ: సజీవదహనం
శాన్ డీయాగో: ఆకాశంలో ప్రయాణిస్తున్న రెండు విమానాలు ప్రమాదవశాత్తు ఢీకొనడంతో నలుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రమాదానికి ఇప్పటి వరకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని అమెరికా అధికారులు అంటున్నారు.
ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో పౌర విమాన శాఖకు చెందిన రెండు విమానాలు బయలుదేరాయి. తరువాత శాన్ డియాగో కౌంటి సమీపంలోని బ్రౌన్ ఫీల్డ్ ప్రాంతంలో రెండు విమానాలు గాలిలోనే డీకొన్నాయి.

ఈ ప్రమాదంలో రెండు ఇంజిన్ల సాబ్రిలైనర్ జెట్, సింగిల్ ఇంజిన్ సెస్ న్నా 172 విమానం కుప్పకూలిపోయాయని పౌర విమానయాన శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో రెండు విమానాలలో ఉన్న నలుగురు మరణించారని అధికారులు అన్నారు.
విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. మంటలు అదుపు చేసే సమయంలో అగ్నిమాపక శాఖకు చెందిన ఒక గార్డుకు తీవ్రగాయాలైనాయని అధికారులు చెప్పారు. విమానాలు డీకొనడానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications