కొవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం -నలుగురు పేషెట్లు దుర్మరణం
కొవిడ్ దెబ్బకు కకావికలమైన బ్రెజిల్ లో మరో ఘోర సంఘటన చోటుచేసుకుంది. కొవిడ్ రోగులు చికిత్స పొందుతోన్న ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తూర్పు బ్రెజిలియన్ నగరమైన అరకాజు నగరంలోని నెస్టార్ పీవా కొవిడ్ ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది.
దేశంలో కరోనా తీవ్రత స్థిరంగా కొనసాగుతోన్న దరిమిలా ఆస్పత్రులన్నీ కొవిడ్ రోగులతో నిండిపోయాయి. నెస్టార్ పీవా ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఇన్ పేషెంట్ వార్డులో 60 మంది పేషెంట్లున్నారు. అక్కడి సహాయక సిబ్బంది చాలా మంది రోగులను కాపాడినప్పటికీ, ఘటనలో నలుగురు మరణించారు.

మృతుల్లో 77 ఏళ్ల వృద్ధురాలు కూడా ఉన్నారని, అగ్ని ప్రమాదం తర్వాత రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించామని, ప్రస్తుతం రీస్టోరేషన్ పనులు జరుగుతున్నాయని, ఘటనపై లోతైన దర్యాప్తునకు ఆదేశించామని అరకాజు నగర మేయర్ ఎడవల్డో నోజిరియా మీడియాకు చెప్పారు.
అమెరికా, భారత్ తోపాటు కరోనాకు తీవ్రంగా ప్రభావితమైన దేశం బ్రెజిల్ కావడం తెలిసిందే. నిన్న ఒక్కరోజే దేశంలో 50,495 కొత్తకేసులు, 2,418 మరణాలు నమోదయ్యాయి. బ్రెజిల్ లో మొత్తం కేసులు 1,63,92,657కు, మరణాలు 4,59,171కు పెరిగాయి.












Click it and Unblock the Notifications