వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్కూల్ విద్యార్థులకు కండోమ్స్-ఐదో తరగతి నుంచే-కొత్త సెక్స్ ఎడ్యుకేషన్ పాలసీపై దుమారం

|
Google Oneindia TeluguNews

అమెరికాలోని చికాగో పబ్లిక్ స్కూల్స్‌కు చెందిన ఎడ్యుకేషన్ బోర్డు తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఐదో తరగతి... ఆపై తరగతుల విద్యార్థులకు స్కూళ్లలో 'కండోమ్స్'ను అందుబాటులో ఉంచాలని బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు బోర్డు పరిధిలోని 600 స్కూళ్లకు ఆదేశాలు జారీ చేసింది. చికాగో డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ సహకారంతో స్కూళ్లకు కండోమ్స్‌ను సప్లై చేయనున్నారు. ఒకవేళ కండోమ్స్ అయిపోతే స్కూల్ ప్రిన్సిపాల్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్‌కు సమాచారమిచ్చి తెప్పించుకోవాల్సి ఉంటుంది.

సెక్స్ ఎడ్యుకేషన్‌లో భాగంగా...

సెక్స్ ఎడ్యుకేషన్‌లో భాగంగా...

చికాగో పబ్లిక్ స్కూల్స్‌ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గతేడాది డిసెంబర్‌లోనే ఈ పాలసీని రూపొందించింది. సెక్స్ ఎడ్యుకేషన్‌లో భాగంగా ఈ పాలసీని తీసుకొస్తున్నట్లు తెలిపింది.దీని ప్రకారం ఎలిమెంటరీ స్కూళ్లలో 250 వరకు,హైస్కూళ్లలో 1వెయ్యి వరకు కండోమ్స్‌ను ఎప్పుడూ అందుబాటులో ఉంచాలి. ఇవి పూర్తిగా ఉచితం. విద్యార్థుల్లో లైంగిక వ్యాధులు,అవాంఛిత గర్భాలను నిరోధించేందుకే ఈ పాలసీని తీసుకొచ్చినట్లు సీపీఎస్(చికాగో పబ్లిక్ స్కూల్స్) అధికారులు చెబుతున్నారు.

సీపీఎస్ డాక్టర్ ఏమన్నారంటే...

సీపీఎస్ డాక్టర్ ఏమన్నారంటే...

సీపీఎస్ డాక్టర్ కెన్నెత్ ఈ పాలసీపై మాట్లాడుతూ...దీనిపై కాస్త వివాదం రేగే అవకాశం ఉన్నప్పటికీ... విద్యార్థుల ఆరోగ్య రీత్యా ఇది అవసరమని పేర్కొన్నారు. సమాజం చాలా మార్పులకు గురైందన్నారు.విద్యార్థులకు కండోమ్స్ అందుబాటులో ఉంచకపోతే... వారికి సరైన జాగ్రత్తలు చెప్పకపోతే... వారికి చెడు జరిగే అవకాశం ఉందన్నారు. ఆరోగ్యకర నిర్ణయాలు తీసుకునేందుకు కచ్చితమైన,స్పష్టమైన సమాచారాన్ని తెలుసుకునే హక్కు యువతకు ఉందన్నారు. తద్వారా వారితో పాటు ఇతరుల ఆరోగ్యాన్ని కాపాడగలుగుతారని పేర్కొన్నారు.

సెక్స్ ఎడ్యుకేషన్ పాఠాలు...

సెక్స్ ఎడ్యుకేషన్ పాఠాలు...

చికాగో పబ్లిక్ స్కూల్స్ బోర్డ్ రూపొందించిన సెక్స్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా విద్యార్థులకు 'ఆరోగ్యకర సంబంధాలు-సమ్మతి,శరీర నిర్మాణ శాస్త్రం,శరీర ధర్మ శాస్త్రం,కౌమార యుక్త వయసులో శరీరంలో కలిగే మార్పులు,లైంగిక ధోరణులు,లైంగిక ఆరోగ్యం...' తదితర అంశాలను విద్యార్థులకు బోధించనున్నారు. ఒకవేళ ఎవరైనా తల్లిదండ్రులకు దీనిపై అభ్యంతరం ఉంటే లిఖితపూర్వకంగా బోర్డుకు లేదా స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.

మండిపడుతున్న తల్లిదండ్రులు

మండిపడుతున్న తల్లిదండ్రులు

సెక్స్ ఎడ్యుకేషన్‌లో భాగంగా ఐదో తరగతి విద్యార్థులకు కండోమ్స్ అందుబాటులో ఉంచాలన్న పాలసీని కొంతమంది తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఐదో తరగతి అంటే కేవలం 12 ఏళ్ల వయసు ఉంటుందని... అప్పటికీ వారు ఇంకా చిన్నపిల్లలే అని చెబుతున్నారు. పిల్లలకు కండోమ్స్ ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు.ఇది సరైన నిర్ణయం కాదని... దీనిపై పునరాలోచన చేయాలని కోరుతున్నారు. ఈ వివాదంపై చికాగో విమెన్ హెల్త్ సెంటర్ డైరెక్టర్ స్కౌట్ బ్రాట్ మాట్లాడుతూ...నిజానికి ఈ పాలసీ ద్వారా నష్టాన్ని తగ్గించవచ్చునని పేర్కొన్నారు.

English summary
A new program by Chicago Public Schools involves offering condoms to elementary school students in fifth grade.Incoming students will have access to 250 condoms per elementary school; high schools are required to have 1,000 on hand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X