మెహుల్ చోక్సీకి డొమినికా హైకోర్టు బెయిల్ మంజూరు: అంటిగ్వాకు వెళ్లేందుకు అనుమతి కూడా
రోజౌ: పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి డొమినికా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 'మెడికల్ గ్రౌండ్స'పై ఈ బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. అంతేగాక, 10,000 ఈస్టర్న్ కరీబియన్ డాలర్లను డిపాజిట్ చేయాల్సిందిగా ఆదేశించింది.
అంతే కాదు, అక్రమ ప్రవేశం, న్యాయ సమీక్ష అన్ని చర్యలు వాయిదా పడ్డాయి. చోక్సీ డొమినికాకు 'తిరిగి ప్రయాణించడానికి తగినవాడు' అని భావించే వరకు ఆంటిగ్వాకు 'ఖచ్చితంగా వైద్య చికిత్స కోసం' ప్రయాణించడానికి అనుమతి లభించింది.
డొమినికా కోర్టు ఈ దరఖాస్తును ఆమోదించడంతోపాటు జూలై 23 న జరగాల్సిన విచారణను జూలై 12కి మార్చింది.

'డొమినికన్ కోర్టు గౌరవం సూత్రాన్ని సమర్థించింది. డొమినికన్ కోర్టు న్యాయ నియమాన్ని సమర్థించింది' అని మెహుల్ చోక్సీ బెయిల్ కోసం ఆయన తరపున వాదించిన న్యాయవాది విజయ్ అగర్వాల్ మీడియాకు వెల్లడించారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) కుంభకోణంలో నీరవ్ మోడీ, ఆయన మామ మెహుల్ చోక్సీలు నిందితులైన విషయం తెలిసిందే. సుమారు 13వేల కోట్లకుపైగా ఈ స్కాంలో నిందితులైన వీరిద్దరూ దేశందాటి పారిపోయారు. వీరిద్దరినీ భారత్‌కు తీసుకొచ్చేందుకు భారత దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. తాజాగా, డొమినికా కోర్టు బెయిల్ ఇవ్వడంతోపాటు షరతులు విధించడంతో భారత అధికారులకు ఇది కొంత ఇబ్బందికర పరిస్థితి తీసుకొచ్చినట్లయితే.












Click it and Unblock the Notifications