భారత్‌కు జో బైడెన్: టూర్ షెడ్యూల్ ఫిక్స్: తేదీలు ఇవే
వాషింగ్టన్: ప్రపంచ దేశాల్లో అత్యున్నత భేటీల్లో ఒకటిగా భావించే జీ20 హై ప్రొఫైల్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. దీనికి సంబంధించిన కోలాహలం దేశంలో నెలకొంది. సెప్టెంబర్ 9,10 తేదీల్లో ఈ సమ్మిట్‌ను నిర్వహించబోతోంది భారత్. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన సన్నాహాక సమావేశాలు విశాఖపట్నంతో పాటు బెంగళూరు, ముంబై, జైపూర్.. వంటి నగరాల్లో సన్నాహాక సదస్సులు ముగిశాయి.
జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి అమెరికా, ఫ్రాన్స్, రష్యా, చైనా అధ్యక్షులు జో బైడెన్, ఇమ్మానుయెల్ మక్రాన్, వ్లాదిమిర్ పుతిన్, గ్ఝి జిన్‌పింగ్ హాజరు కానున్నారు. వివిధ దేశాల ప్రధానులు ఈ సమ్మిట్‌లో పాల్గొనడానికి భారత్‌కు రానున్నారు. భారత్ సహా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు ఇందులో సభ్యులుగా కొనసాగుతున్నాయి.

జీ20లో భారత్‌తోపాటు అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్ అమెరికా, యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు ఇందులో ఉన్నాయి. ఆయా దేశాల ప్రతినిధులందరూ వచ్చే సంవత్సరం భారత్‌లో జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సుకు హాజరు కావాల్సి ఉంటుంది.
ఈ ప్రతిష్ఠాత్మక జీ20 సదస్సులో పాల్గొనడానికి జో బైడెన్.. భారత్‌కు రానున్నారు. ఆయన పర్యటన ఖరారైనట్లు యూఎస్ మీడియా తెలిపింది. సెప్టెంబర్ 7 నుంచి 10వ తేదీ వరకు బైడెన్ భారత్‌లో పర్యటిస్తారు. 7వ తేదీన ఆయన భారత్‌కు చేరుకుంటారు. ఆయన వెంట అమెరికా విదేశాంగ, రక్షణ, వాణిజ్యం, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు ఉంటారు.
తన భారత పర్యటనలో భాగంగా.. జో బైడెన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖర్‌ను మర్యాదపూరకంగా కలుసుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖాముఖి చర్చల్లో పాల్గొంటారు. భారత్- అమెరికా ద్వైపాక్షిక సమావేశాలకు హాజరవుతారు. పలు ఒప్పందాలపైనా ఈ రెండు దేశాల అధికారులు సంతకాలు చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications