పాక్ కు ఊహించని దెబ్బ - రంగంలోకి G7 దేశాలు,నో ఛాన్స్..!!
పాకిస్థాన్ కు ఊహించని దెబ్బలు తగులుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ వేళ ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టటం లో భారత్ సక్సెస్ అయింది. పాక్ తో పాటుగా పీఓకేలోని ఉగ్రవాద శిబిరాల ను భారత్ గురి పెట్టి నేల మట్టం చేసింది. వంద మంది ఉగ్రవాదులను మట్టు బెట్టింది. ప్రపంచ దేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని సూచిస్తున్నాయి. మధ్య వర్తిత్వం కోసం పాక్ ప్రయత్నాలు చేస్తున్నా.. ఎవరూ జోక్యం చేసుకోవటం లేదు. ఈ సమయంలోనే G-7 దేశాలు స్పందించాయి. పాక్ పైన పరోక్షంగా ఒత్తిడి పెంచే ప్రకటన చేసాయి.
పాకిస్థాన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. భారత్ పైన దుస్సాహసానికి దిగిన పాక్ కు భారత్ సేనలు దిమ్మ తిరిగే స్థాయిలో సమాధానం ఇస్తున్నాయి. అటు పాక్ లో చోటు చేసుకుంటున్న పరిణామాల తో ఆ దేశాధినేతలు బిక్కు బిక్కు మంటున్నారు. అమెరికా ఇప్పటికే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఇలా అన్ని రకాలుగా దెబ్బ తింటున్న పాక్‌కు మరో షాక్ తగిలింది. జీ7 దేశాలు ఊహించని దెబ్బ కొట్టాయి. పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు అమెరికా, కెనడా, జపాన్, ఫ్రాన్స్, జర్మన్, ఇటలీ దేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. పాకిస్తాన్ తీరును తప్పుబట్టాయి. యుద్ధం విషయంలో ఇరు దేశాలు సంయమనం పాటించాలని సూచించాయి.

ఇదే సమయంలో కీలక సూచనలు చేసాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే ప్రాంతీయ స్థిరత్వంపై భారీ దెబ్బ పడే అవకాశం ఉందని తెలిపాయి. తాము ఇరు దేశాల ప్రజల క్షేమం గురించి ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నాయి. రెండు దేశాలు వీలైనంత త్వరగా యుద్ధాన్ని ఆపాలని, కూర్చుని శాంతియుతంగా మాట్లాడుకునే ప్రయత్నం చేయాలని విజ్ణప్తి చేశాయి. తాము యుద్ధ పరిస్థితులను సమీక్షిస్తూ ఉంటామని అన్నాయి. పహల్గాం ఉగ్ర దాడికి స్పందన భారత్ ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ తో పాక్ విలవిలలాడుతోంది. భారత్ పైన టర్కీ డ్రోన్లుతో దాడికి ప్రయత్నిస్తోంది. భారత్ సరిహద్దు రాష్ట్రాల్లోని జిల్లాల పైన దాడులకు దిగుతోంది. భారత్ తన ఆయుధాలో పాక్ డ్రోన్లను నేల మట్టం చేస్తోంది. ఇటు పాక్ లో ప్రధాని కీలక భేటీ నిర్వహిస్తున్నారు. ఇటు ప్రధాని మోదీ ప్రతీ క్షణం ఆపరేషన్ సింధూర్ పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు G-7 దేశాల స్పందనతో పాక్ ఏకాకి అయింది.












Click it and Unblock the Notifications