G7 summit: భారత మూల సిద్ధాంతం అదే: సైబర్ స్పేస్..సోషల్ మీడియా: రెండోరోజు మోడీ కీలక సూచన

న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మకమైన జీ7 వర్చువల్ సమ్మిట్ రెండోరోజును ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. పలు కీలక అంశాలను ఆయన ప్రస్తావించారు. కరోనా వైరస్ తరహా పరిస్థితులు.. అన్ని దేశాలు కూడా తమ ఆరోగ్య రంగాన్ని పునఃసమీక్షించుకోవాల్సిన పరిస్థితులను కల్పించాయని చెప్పారు. సైబర్ స్పేస్, సోషల్ మీడియా, వాతావరణ మార్పులు, ఆరోగ్యరంగంలో తలెత్తుతోన్న సరికొత్త పరిస్థితులు.. ఇవన్నీ ప్రపంచానికి సవాల్‌గా మారబోతాయని అన్నారు. వాటిని సమష్టిగా పరిష్కరించుకోవడానికి ఓపెన్ సొసైటీస్ సిద్ధాంతాన్ని అనుసరించాల్సి ఉంటుందని చెప్పారు.

జీ7 వర్చువల్ సమ్మిట్‌లో ఆయన పాల్గొన్నారు. దేశ రాజధాని నుంచి వీడియో కాన్ఫరెన్స్ రూపంలో ప్రసంగించారు. బ్రిటన్‌లోని కాబిస్ బే‌లో ఈ శిఖరాగ్ర సదస్సు కొనసాగుతోంది. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, ఇటలీ, జపాన్ దేశాధినేతలు ఇందులో పాల్గొన్నారు. భారత తరఫున ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భాగస్వామి అయ్యారు. రెండో రోజు అజెండా బిల్డింగ్ బ్యాక్ టుగెదర్-ఓపెన్ సొసైటీస్ అండ్ ఎకానమీస్ అంశంపై ప్రసంగించారు. తన అభిప్రాయాలను పంచుకున్నారు.

 G7 summit should adopted the ‘Open Societies Statement’ at the end of the meeting: PM Modi

ఓపెన్ సొసైటీ అనేది భారత దేశ సహజ మూల సిద్ధాంతమని ప్రధాని పేర్కొన్నారు. తోటి వారికి సహకరించడమనేది భారత ప్రజాస్వామ్యానికి పునాదుల్లాంటివని చెప్పారు. భారత సివిలైజేషన్‌లో అది సహజ భాగమని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని అన్ని దేశాలు పాటించాల్సిన అవసరం ఉందని మోడీ అన్నారు. జీ7 సమ్మిట్ ముగింపు సందర్భంలో ఓపెన్ సొసైటీస్‌ అంశంపై దేశాధినేతలు ఓ తీర్మానం చేస్తారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు.

భవిష్యత్తులో సైబర్ స్పేస్, సోషల్ మీడియా వంటి ప్లాట్‌ఫామ్‌ల నుంచి సవాళ్లు ఎదురవుతాయని మోడీ హెచ్చరించారు. అవి పారదర్శకంగా వ్యవహరించేలా టెక్ కంపెనీలు ప్రపంచానికి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. వాతావరణ మార్పులపై పారిస్‌లో సమావేశమైన జీ20 సదస్సులో చేసిన తీర్మానాలకు అన్ని దేశాలు కట్టుబడి ఉండాలని, దానికి లోబడి పనిచేయాలని చెప్పారు. ఆ దిశగా తము కదులుతున్నామని మోడీ తెలిపారు. 2030 నాటికి జీరో స్థాయిలో కర్బన ఉద్గారాలను ఉత్పత్తి చేయాలని భారతీయ రైల్వే లక్ష్యంగా నిర్దేశించుకుందని పేర్కొన్నారు. సౌర విద్యుత్ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా దీన్ని మరింత నియంత్రించవచ్చని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+