• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పబ్జీ తరహాలో మరో మహమ్మారి.. ఇప్పటికే చైనాను కలవరపెడుతున్న 'గేమ్ ఫర్ పీస్'

|

ప్రపంచవ్యాప్తంగా అతికొద్ది సమయంలోనే పాపులర్ అయిన వీడియో గేమ్ ఏదంటే ఠక్కున వచ్చే సమాధానం పబ్జీ. ప్లేయర్ అన్‌నోన్స్ బ్యాటిల్ గ్రౌండ్‌కు షార్ట్‌ఫామ్ అయిన పబ్జీకి బానిసలై పలువురు ప్రమాదాలకు గురయ్యారు. మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పిల్లల్లో హింసాత్మక ప్రవృత్తిని పెంచేలా ఉందన్న కారణంతో చైనా సహా పలు దేశాలు ఈ గేమ్‌ను బ్యాన్ చేశాయి. నిషేధం కారణంగా పబ్జీని రూపొందించిన కంపెనీ టెన్సెంట్‌కు భారీగా నష్టం రావడంతో అదే రేంజ్‌లోనే మరో గేమ్‌ను అందుబాటులోకి తెచ్చింది.

పబ్జీ ఆడుతూ కారులోనే ఉండిపోయిన బాలుడు .. ఊపిరాడక మృతి

గేమ్ ఫర్ పీస్

గేమ్ ఫర్ పీస్

పబ్జీ డెవలపర్ అయిన టెన్సెంట్ తాజాగా గేమ్ ఫర్ పీస్ రిలీజ్ చేసింది. విడుదలైన కొన్ని గంటల వ్యవధిలోనే ఇది యమా క్రేజ్ తెచ్చుకుంది. యూజర్లకు అందుబాటులోకి తెచ్చిన మూడు రోజుల్లోనే దాదాపు వంద కోట్లకుపైగా డౌన్‌లోడ్స్ జరిగాయంటే దానికున్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. పబ్జీపై నిషేధంతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన టెన్సెంట్ కంపెనీకి గేమ్ ఫర్ పీస్ కాసుల పంట పండించింది. 72 గంటల్లోనే 14 మిలియన్ డాలర్ల ఆదాయం తెచ్చి పెట్టింది. పబ్జీ తరహాలోనే ఉండే ఈ ఆటలో హింస స్థాయి కాస్త తక్కువ ఉన్నట్లు తెలుస్తోంది.

18ఏళ్ల పైబడినవారికి మాత్రమే

18ఏళ్ల పైబడినవారికి మాత్రమే

గేమ్ ఫర్ పీస్‌ను 16 ఏళ్ల పైబడిన వారు మాత్రమే డౌన్‌లోడ్ చేసుకునేలా టెన్‌సెంట్ నిబంధనలు పెట్టింది. 18ఏళ్ల లోపు వయసున్న వారు రోజులో కేవలం రెండు గంటలు మాత్రమే ఆడుకునే వీలు కల్పించింది. గేమ్ పేరులో ఉన్నట్లుగానే ఈ ఆట శాంతి సందేశం వ్యాపింపజేసేలా ఉంటుందని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం చైనాలో మాత్రమే అందుబాటులో ఉన్న గేమ్ ఫర్ పీస్ త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని చెప్పింది.

గేమ్ ఫర్ పీస్‌పై భిన్నాభిప్రాయాలు

గేమ్ ఫర్ పీస్‌పై భిన్నాభిప్రాయాలు

పబ్జీ గేమ్ బ్యాన్‌తో నిరాశకు గురైన యువత గేమ్ ఫర్ పీస్‌ రాకతో ఎగిరి గంతేస్తున్నారు. అయితే ఈ ఆటపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పబ్జీతో పోలిస్తే ఈ గేమ్‌లో హింసస్థాయి కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ, ఈ గేమ్ కూడా పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఏ వాదన ఎలా ఉన్నా రిలీజైన మూడు రోజుల్లోనే యాపిల్ ఆప్ స్టోర్‌లో టాప్ ప్లేస్‌కు చేరిన గేమ్ ఫర్ పీస్.. ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తే ఇంకెంత క్రేజ్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.

English summary
Tencent Holdings Ltd's alternative to its video game "PlayerUnknown's Battlegrounds" (PUBG) in China became the world's top-grossing mobile battle royale title on Apple's iOS app store in the first 72 hours of its launch, research showed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more