అమెరికా నిషేధం: దేవుడు రక్షిస్తాడన్న ఉగ్రవాది హఫీజ్

బిబిసి వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆఫ్ఘనిస్థాన్ విషయంలో భారతదేశం సాయం పొందేందుకు అమెరికా తమ సంస్థ అయిన జమాత్ ఉద్ దవా(జెయుడి)ను లక్ష్యం చేసుకుందని ఆరోపించాడు.
భారత్ సూచన మేరకు అమెరికా తమ సంస్థ జెయుడిపై నిషేధం విధించిందని హఫీజ్ ఆరోపించాడు. కాగా, అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ హఫీస్ సాయిద్ పాకిస్థాన్‌లోని లహోర్ నగరంలోనే నివాసం ఉంటున్నాడు.
అమెరికా ఎప్పుడూ భారత్ సూచన మేరకే నిర్ణయాలు తీసుకుంటోందని అన్నాడు.
ఆఫ్ఘనిస్థాన్ విషయంలో భారత సాయం కోసమే అమెరికా తమ సంస్థపై నిషేధం విధించిందని హఫీజ్ ఆరోపించాడు. ముంబై దాడులతో తనకు సంబంధం లేదని.. తనకు వ్యతిరేకంగా భారత్ చూపిన ఆధారాలన్నీ ప్రచారమేనని పాకిస్థాన్ కోర్టు కూడా వెల్లడించిందని హఫీజ్ పేర్కొన్నాడు.
తన తలకు 10 మిలియన్ డాలర్లు ప్రకటించడం తనకేలాంటి ఆందోళన కలిగించడం లేదనీ హఫీజ్ తెలిపాడు. పాకిస్థాన్ ప్రజలకు తానేవరో తెలుసుననీ, తనను వారు ప్రేమిస్తుంటారని చెప్పాడు. పాకిస్థాన్‌లోని ఎవరూ కూడా అమెరికా అధికారులను సంప్రదించరని తెలిపాడు. తాను చేస్తున్నది చాలా స్పష్టంగా ఉందనీ.. తనకు దేవుడు రక్షణగా ఉంటాడని చెప్పాడు. పాకిస్థాన్-ఇండియా సత్సంబంధాలకు మీరు అడ్డంకిగా ఉండాలనకుకుంటున్నారా? అని ప్రశ్నించగా.. భారత్ తననే ఒక సమస్యగా చూస్తోందని, కాశ్మీర్ సమస్య నుంచి పక్కదారి పట్టిస్తోందని ఆరోపించాడు. భారత్‌తో సత్సంబంధాలకు తాము అడ్డంకి కాదని చెప్పాడు.












Click it and Unblock the Notifications