ఎయిర్ పోర్టులో బీభత్సం: బంగారం లూటీ
లిమా: ఎయిర్ పోర్టులోకి చోరబడిన దుండగులు బంగారు, నగదు లూటీ చేసి పరారైన సంఘటన పెరూ దేశంలో జరిగింది. దుండగులలో కొందరిని పోలీసులు పట్టుకుని విచారణ చేస్తున్నారు. అయితే అప్పటికే 93 కేజీల బంగారం, 13.3 కోట్ల రూపాయల నగదు లూటీ అయ్యింది.
విమానంలోకి లోడ్ చెయ్యడానికి కారులో 123 కేజీల బంగారం, రూ. 13.3 కోట్లు తీసుకు వచ్చి రన్ వే దగ్గర పెట్టారు. కొద్ది సేపట్లో విమానంలో లోడ్ చెయ్యడానికి అక్కడ సిబ్బంది ఉన్నారు. అదే సమయంలో దుండగులు కార్లలో ఎయిర్ పోర్టులోకి దూకుసు వెళ్లారు.
తరువాత దుండగులు తుపాకులతో ఇష్టం వచ్చినట్లు కాల్పులు జరిపారు. రన్ వే మీద ఉన్న విమానాల మీద కాల్పులు జరిపారు. రెండు విమానాలలోని ప్రయాణికులు కిందపడుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. అదే సమయంలో దుండుగులు బాష్పవాయుగోళాలు ప్రయోగించారు.

నిమిషాలలో బంగారు నగదు లూటీ చేసి కార్లలో పారిపోవడానికి ప్రయత్నించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆరు మంది దుండగులను అరెస్టు చేసి 30 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుండగులు నగదు, బంగారం లూటీ చేసి పెరూ పొరుగున ఉన్న బొలీవియా దేశానికి పారిపోవడానికి ప్లాన్ వేశారు.
అరెస్టు అయిన ఆరుగురిలో ఒక బొలీవియా దేశస్థుడు ఉన్నాడని పోలీసు అధికారులు తెలిపారు. అయితే అప్పటికే సినిమా ఫక్కిలో 93 కిలోల బంగారం, నగదు లూటీ చేసిన దుండగులు మాయం అయ్యారు. అరెస్టు అయిన వారి నుండి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications