ఆశ్చర్యపోయా, భారత్‌తో సంబంధంపై చైనాకు భయమొద్దు: ఒబామా

వాషింగ్టన్: అమెరికా - భారత్‌ల మధ్య సంబంధాల పైన చైనా భయపడవలసిన పని లేదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పేర్కొన్నారు. ఒబామా భారత్‌లో పర్యటించడం, ఇరుదేశాల మధ్య సంబంధాల పైన చైనా ఇటీవల వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఒబామా స్పందించారు.

కొన్ని విశ్వసనీయ అంశాలే తమను భారత దేశానికి దగ్గర చేశాయన్నారు. దీనిపై చైనా భయపడాల్సిన పని లేదన్నారు. న్యూఢిల్లీతో వాషింగ్టన్‌కు మంచి సంబంధాలున్నాయన్నారు. ఇటీవల ఓ అంతర్జాతీయ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒబామా తన పర్యటన గురించి మాట్లాడారు.

తన భారత్ పర్యటన పైన చైనా ప్రకటనలను చూసి ఆశ్చర్యపోయానని, విలువలు ప్రతిబింబించే భారత్ ప్రజాస్వామ్యమే తమ సంబంధాలకు పునాది అన్నారు. అందుకే ఏదో ఒక అనుబంధం ఉందని తాను భావిస్తానని, తమ దేశ ప్రజలు కూడా అలాగే అనుకుంటారని భావిస్తున్నానని చెప్పారు.

Good US-India Relations No Threat to China: Barack Obama

మే 26లోపు చైనాలో మోడీ పర్యటన

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఏడాది మే నెల 26వ తేదీ లోపు చైనాలో పర్యటించనున్నారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరిన ఏడాది దాటకముందే ఆయన చైనాలో తొలి పర్యటన జరపనున్నారు. సంప్రదాయానికి భఇన్నంగా వినూత్న పద్ధతుల్లో చైనాతో చర్చలు నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రధాని మోడీ భావిస్తున్నారు.

ప్రస్తుతం చైనాలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పర్యటిస్తున్నారు. ఆమె చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో ఆదివారం భేటీ అయ్యారు. అనంతరం మాట్లాడారు. ఇరుదేశాల సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పడం అవసరమన్నారు. కైలాస్ నుండి మానససరోవర్ యాత్రికుల కోసం టిబెట్ నుండి సిక్కిం ద్వారా సాగే రెండో మార్గాన్ని అమల్లోకి తెచ్చేందుకు చైనాతో చర్చించినట్లు సుష్మా చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+