Samsung: శాంసంగ్ వారసుడికి ప్రభుత్వం క్షమాభిక్ష

లంచం కేసులో దోషిగా తేలి జైలుశిక్షను ఎదుర్కొంటున్న ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజ కంపెన శాంసంగ్ వారసుడు లీజే యాంగ్ కు దక్షిణ కొరియా ప్రభుత్వం క్షమాభిక్షను ప్రసాదించనుంది. సంవత్సరం జైలు శిక్ష ఉండగానే యాంగ్ కు కేసు నుంచి విముక్తి లభించబోతోంది. ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని జైలులో ఉన్న వ్యాపార ప్రముఖులకు అక్కడి ప్రభుత్వం కేసుల నుంచి విముక్తి కల్పించడం దక్షిణ కొరియాలో ఎప్పటి నుంచో ఆనవాయితీగా ఉంది. వచ్చే సోమవారం దక్షిణ కొరియా లిబరేషన్ డేను పురస్కరించుకొని 1700 మంది దోషులకు అధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్ క్షమాభిక్ష పెట్టనున్నారు. యాంగ్ తో పాలు పలువురు పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. దీనివల్ల కంపెనీ బోర్డులోకి రావడానికి యాంగ్ కు అవకాశం ఏర్పడింది.

శాంసంగ్ గ్రూప్ అధినేత లీకున్ హీ పెద్ద కుమారుడు యాంగ్. అతను వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. 2017లో లంచం కేసులో అరెస్టయ్యారు. శాంసంగ్ రెండు అనుబంధ కంపెనీల విలీనానికి ప్రభుత్వం నుంచి అనుమతులు పొందేందుకు ఆయన 2015లో దేశాధ్యక్షురాలు పార్క్ గ్వెన్ కి లంచం ఇచ్చారన్న ఆరోపణలపై అరెస్ట్ చేశారు. తర్వాత న్యాయస్థానం 4 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

Government amnesty for Samsung chairman lee

Recommended Video

    అదిరిపోయే కొత్త ఫీచర్స్ తో ఐఫోన్14 *gadgets | Telugu OneIndia

    ఈ కుంభకోణం బయటపడిన తర్వాత పార్క్ గ్వెన్ ప్రభుత్వం కూలిపోయింది. తనకు విధించిన శిక్షపై యాంగ్ అప్పీలేట్ కోర్టును ఆశ్రయించారు. 2018లో శిక్ష ను తాత్కాలికంగా నిలిపివేసినా సుప్రీంకోర్టు యాంగ్ కు రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 18 నెలల శిక్ష అనుభవించిన 2021 ఆగస్టులో పెరోల్ పై బయటకు వచ్చారు. త్వరలోనే తండ్రి వారసత్వాన్ని అందుకొని యాంగ్ శాంసంగ్ బాధ్యతలు పూర్తిస్థాయిలో చేపట్టబోతున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+