బీజింగ్ లో రెడ్ అలర్ట్ ప్రకటించిన చైనా

బీజింగ్: చైనా రాజధాని బీజింగ్ నగరంలో కాలుష్య మేఘాలు దట్టంగా కమ్ముకొని ప్రజలకు ఊపిరిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పరిస్థితి విషమించకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

బీజింగ్ నగరంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. కొన్ని జాతీయ, అంతర్జాతీయ విమానా సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. రోడ్ల పక్కన తినుబండారాలను తయారు చేసే అన్ని షాప్ లు మూయించేశారు.

రోడ్ల మీదకు వచ్చే ప్రజలు తప్పనిసరిగా మాస్కులు వేసుకోవాలని సూచించారు. రోడ్ల మీదకు ఎక్కువ కార్లు రాకుండా నియంత్రించారు. భారీ వాహనాలు, చెత్త తీసుకు వెళ్లే కార్పొరేషన్ వాహనాలు పూర్తిగా బీజింగ్ నగరంలోకి రాకుండా చూస్తున్నారు.

Government issued its first Red alert for Pollution in Beijing in China

ఆకాశాన్ని కమ్ముకున్న కాలుష్య మేఘాల నుంచి కాలుష్య కణాలను భూ ఉపరితలానికి తీసుకు వచ్చేందుకు భారీ వాటర్ క్యానన్ల ద్వారా ఆకాశంలోకి నీటి తంపరులను ఎగజిమ్ముతున్నారు.

ప్రపంచ నగరాల్లో కార్బన్ ఉద్గారాలను విడుదల చేస్తున్న నగరంగా బీజింగ్ మొదటి స్థానంలో ఉంది. పరిశ్రమల కాలుష్యంతో పాటు విద్యుత్ ప్లాంటుల నుంచి వెలువడుతున్న కార్బన్ ఉద్గారాలు, ఇళ్లలో బొగ్గు వినియోగం పెరడగంతో బీజింగ్ నగరానికి ఈ పరిస్థితి వచ్చిందని చైనా కాలుష్య నిరోధక విభాగం వెల్లడించింది.

అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణం కన్నా పది ఇంతలు ఎక్కువలో ప్రస్తుతం బీజింగ్ లో కాలుష్యం ఉందని బీజింగ్ లోని అమెరికా ఎంబాసీ వర్గాలు తెలిపాయి. 2030 నాటికి ఈ కాలుష్యాన్ని సగానికి సగం తగ్గించాలన్నది చైనాకు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+