• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మన పాలపుంతలో మహా కాలబిలం ఫొటోకు చిక్కింది...

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
సాజిటేరియస్ ఎ*

ఇది మన నక్షత్ర వీధి నడిబొడ్డున ఉండే మహా కాల బిలం. మన శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారి ఈ కాల బిలాన్ని ఫొటో తీశారు.

సాజిటేరియస్ ఎ* (సాజిటేరియస్ ఎ స్టార్) అని పిలిచే ఈ బ్లాక్ హోల్ ఎంత భారీదంటే.. దీని ద్రవ్యరాశి మన సూర్యుడి ద్రవ్యరాశి కన్నా 40 లక్షల రెట్లు ఎక్కువ.

మీరు చూస్తున్న ఫొటోలో మధ్యలో నల్లగా కనిపిస్తున్న ప్రాంతంలో ఈ సాజిటేరియస్ ఎ* బ్లాక్ హోల్ ఉంటుంది. దానిచుట్టూ కనిపిస్తున్న వెలుతురు.. విపరీతమైన గురుత్వాకర్షణ శక్తుల వల్ల వేగంగా వెదజిమ్ముతున్న, అతి తీవ్రంగా వేడెక్కిన వాయువు నుంచి వెలువడుతున్న కాంతి.

కొలిచి చూస్తే.. మన సూర్యుడి చుట్టూ బుధగ్రహం తిరిగే కక్ష్య వృత్త పరిధికి దాదాపు ఈ కాలబిలం వృత్తం సమానంగా ఉంటుంది.

అంటే.. దీని అడ్డుకొలత దాదాపు 6 కోట్ల కిలోమీటర్లు ఉంటుంది.

పాలపుంతలో కాలబిలం

అదృష్టవశాత్తూ.. ఈ రాకాసి బిలం మన భూమికి చాలా చాలా దూరంలో - సుమారు 26,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. కాబట్టి మనకు దీని నుంచి ఎప్పుడూ ఎలాంటి ప్రమాదమూ ఉండే అవకాశం లేదు.

ఈవెంట్ హొరైజాన్ టెలిస్కోప్ (ఈహెచ్‌టీ) కొలాబరేషన్ అనే అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఈ ఫొటోను రూపొందించింది.

శాస్త్రవేత్తలు తొలిసారిగా 2019లో మెస్సియర్ 87 (ఎం87) అనే మరో భారీ కాలబిలం ఫొటోను విడుదల చేశారు. అది వేరే నక్షత్ర మండలంలో ఉంటుంది. ఆ బ్లాక్ హోల్ ఎంత పెద్దదంటే మన సూర్యుడి ద్రవ్యరాశి కన్నా 650 కోట్ల రెట్లు పెద్ద ద్రవ్యరాశి దానికి ఉంది. ఎం87 బ్లాక్ హోల్ ఫొటో తర్వాత మన సైంటిస్టులు తీసిన రెండో బ్లాక్ హోల్ ఈ సాజిటేరియస్ ఎ*.

''అయితే ఈ కొత్త ఫొటో విశిష్టమైనది. ఎందుకంటే మన నక్షత్ర మండలంలోని భారీ బ్లాక్ హోల్ ఇది'' అని రాడ్‌బౌడ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హీనో ఫాల్కే బీబీసీతో చెప్పారు. ఆయన ఈహెచ్‌టీ ప్రాజెక్ట్‌లో యూరోపియన్ శాస్త్రవేత్తల్లో ఒకరు.

సాజిటేరియస్ ఎ*

''ఇది మన పెరట్లోనే ఉంది. కాల బిలాలు అంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి? అనేది అర్థం చేసుకోవాలంటే ఆ విషయాలను ఇది బాగా చెప్పగలదు. ఎందుకంటే దీనిని మనం చాలా సూక్ష్మ లక్షణాలతో సహా చూడగలం'' అని ఆయన పేర్కొన్నారు.


కాల బిలం అంటే ఏమిటి?

  • బ్లాక్ హోల్ అనేది పదార్థం తనలో తాను కుప్పకూలిన ప్రాంతం
  • దీని గురుత్వాకర్షణ శక్తి ఎంత బలంగా ఉంటుందంటే కాంతి కూడా దాని నుంచి తప్పించుకోలేదు
  • నిర్దిష్ట భారీ నక్షత్రాలు విస్ఫోటనంతో అంతరించిపోయినపుడు వాటి నుంచి ఈ కాల బిలాలు వస్తాయి
  • వీటిలో కొన్ని చాలా చాలా భారీగా ఉంటాయి, మన సూర్యుడి ద్రవ్యరాశి కన్నా వందల కోట్ల రెట్లు అధిక ద్రవ్యరాశితో ఉంటాయి
  • మన నక్షత్ర మండలాల మధ్య ప్రాంతాల్లో కనిపించే ఈ రాకాసి బిలాలు ఎలా రూపొందుతాయనేది తెలీదు
  • కానీ ఆ నక్షత్ర మండలానికి అవి శక్తినివ్వటంతో పాటు, ఆ మండలం పరిణామాన్ని ప్రభావితం చేస్తాయనేది స్పష్టం

నక్షత్రవీధి కేంద్ర ప్రాంతం

ఈ ఫొటో సాంకేతికంగా ఓ అద్భుత విజయం.

భూమి నుంచి 26,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సాజిటేరియస్ ఎ* .. మహా విశ్వంలో ఓ చిన్న సూది మొన మాత్రమే. అటువంటి లక్ష్యాన్ని సునిశితంగా పరిశీలించటానికి అసాధారణ రిజల్యూషన్ అవసరం.

టెలిస్కోప్

ఇందుకోసం ఈహెచ్‌టీ బృందం వెరీ లాంగ్ బేస్‌లైన్ అరే ఇంటర్ఫెరొమెట్రీ (వీఎల్‌బీఐ) అనే టెక్నిక్‌ను ఉపయోగించింది. మన భూమి పరిమాణంలోని టెలిస్కోపును తయారు చేయటానికి దూరదూరంగా ఏర్పాటు చేసిన ఎనిమిది రేడియో యాంటెనాల వ్యవస్థ అది.

దీనిద్వారా శాస్త్రవేత్తలు ఆకాశాన్ని మైక్రోఆర్క్‌సెకన్ల పరిమాణంలో పరిశీలించటానికి వీలవుతుంది. అరచేతిలో పట్టే డోనట్ వంటి ఓ తినుబండారం చంద్రుడి ఉపరితలం మీద ఉంటే దానిని స్పష్టంగా చూడగలిగేంత తీక్షణత దీనికి ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

JWST artwork

ఇక వచ్చే ఆగస్టులో సరికొత్త సూపర్ స్పేస్ టెలిస్కోప్ జేమ్స్ వెబ్ సాజిటేరియస్ ఎ* మీదకు దృష్టి మళ్లిస్తుంది.

కానీ ఈ కాలబిలాన్ని, దాని చుట్టూ ఉండే వలయాన్ని నేరుగా ఫొటో తీయగలిగేంత రిజల్యూషన్ ఈ 1000 కోట్ల డాలర్ల అంతరిక్ష దూరదర్శినికి లేదు. అయితే దానికి గల అద్భుతమైన ఇన్ఫ్రారెడ్ పనిముట్ల సాయంతో ఈ కాలబిలం చుట్టూ ఉన్న వాతావరణం మీద అధ్యయనానికి అది చేయూతనిస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Great Black hole in the milkyway caught to cameras
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X