కలకలం: గువామ్ లో మోగిన ప్రమాద ఘంటికలు.. పోలీసులకు ఫోన్లు.. తీరా చూస్తే..
సోమవారం అర్ధరాత్రి దాటాక.. 12.25 ప్రాంతంలో గువామ్ ద్వీపంలోని రెండు రేడియో స్టేషన్లు అత్యవసర హెచ్చరికలు జారీ చేసేసరికి ఆ ద్వీప వాసులు ఉలిక్కిపడ్డారు.
హగట్నా(గువామ్): అగ్రరాజ్యం అమెరికాను దెబ్బ తీసేందుకు.. ఆ దేశం అధీనంలో ఉన్న గువామ్ ద్వీపం పై క్షిపణి దాడి జరుపుతామంటూ ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ ప్రకటించిన రోజు నుంచి.. ఆ ద్వీప వాసులకు కంటికి కునుకు కరవైంది.
అలాంటిది సోమవారం అర్ధరాత్రి దాటాక.. 12.25 ప్రాంతంలో గువామ్ ద్వీపంలోని రెండు రేడియో స్టేషన్లు అత్యవసర హెచ్చరికలు జారీ చేసేసరికి ఆ ద్వీప వాసులు ఉలిక్కిపడ్డారు.

ఉత్తర కొరియా క్షిపణులు ప్రయోగించిందేమో అనే భయంతో వారి గుండెలు జారిపోయాయి. తమ ప్రాణాలు కాపాడమంటూ పౌరులంతా అక్కడి పోలీసులకు ఫోన్లు చేసి అర్థించారు.
అయితే.. ఆ హెచ్చరికలు పొరబాటున వచ్చినవేనని అధికార వర్గాలు పేర్కొనడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం దాదాపు వంద మంది ప్రజలు హగట్నాలోని చీఫ్ కెపూహా పార్కులో గుమికూడి శాంతిని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించారు.
అసలే ఉత్తరకొరియా అణుక్షిపణులకు అందేంత దూరంలో ఉంది గువామ్ ద్వీపం.
అమెరికా నౌకా, వైమానిక దళ స్థావరాలున్న ఆ ద్వీపం మీద క్షిపణి దాడులు జరుపుతామంటూ ఉత్తరకొరియా పదేపదే హెచ్చరికలు జారీ చేస్తోంది.
ఈ దీవి సమీపంలో క్షిపణిదాడులకు సంబంధించి ఉత్తరకొరియా సైనిక కమాండర్లు ఆ దేశాధిపతి కిమ్‌జాంగ్‌కు నివేదించినట్టు వస్తున్న వార్తలు.. గువామ్ ద్వీపానికి సంబంధించిన మ్యాపును కిమ్ పరిశీలిస్తున్నట్లు ఫొటోలు లీకవడం, ఇలాంటి వార్తలు పాపం ఆ ద్వీప వాసుల కంటికి కునుకులేకుండా చేస్తున్నాయి.
ఇప్పుడే దాడులు చేయబోమని ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ పేర్కొన్నట్లుగా వార్తలు వస్తున్నా.. ఆ ద్వీపవాసుల్లో కలవరం తగ్గడం లేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications