ఆస్ట్రేలియాలో మరోసారి కాల్పుల మోత.. ముగ్గురు మృతి

ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో కాల్పులు కలకలం రేపాయి. దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. ఈ మేరకు కాల్పులు జరిపిన లేక్ కార్గేలిగో ప్రాంతంలో ప్రస్తుతం సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో దాదాపు 15 వందల మంది నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం అందుతోంది. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ప్రస్తుతం నిందితుల్ని పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నట్లు సమాచారం.

ఆస్ట్రేలియా మరోసారి కాల్పుల మోతతో అట్టుడికింది. గతేడాది డిసెంబర్ 14 న సిడ్నీలోని బోండీ బీచ్ లో కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో 16 మంది మృతి చెందారు. మరో 40 మంది గాయపడ్డారు. ఈ కేసులో తండ్రీకొడుకులే ఘటనకు పాల్పడినట్లు దర్యాప్తు సంస్థలు తేల్చాయి. అయితే సిడ్నీ ఉగ్రదాడి మృతులకు నివాళిగా ఆస్ట్రేలియా జాతీయ సంతాప దినం పాటిస్తున్న రోజే తాజాగా మరోసారి కాల్పులు జరగడం ఆందోళనకరంగా మారింది.

Gunfire Erupts in Rural NSW Town Three Dead Gunman on the Loose

ఆస్ట్రేలియా సౌత్ వేల్స్ రాష్ట్రంలోని లేక్ కార్గేలిగో ప్రాంతంలో కాల్పుల మోత మోగింది. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ఘటనానంతరం దుండగులు అక్కడినుంచి పరారైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు.. స్థానికులను అప్రమత్తం చేశారు. ఘటన జరిగిన ప్రాంతం ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీకు 611 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్థానిక ప్రజలు ఇళ్లలోనే ఉండాలని బయటకు రావొద్దని అధికారులు సూచనలు చేశారు. ఇక గతంలో బోండీ బీచ్ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో ఇది ఉగ్ర దాడా లేదా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+