ఆస్ట్రేలియాలో ఇండియన్ రెస్టారెంట్‌పై వ్యక్తి కాల్పులు

సిడ్నీ: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఓ ఇండియన్ రెస్టారెంటు పైన కాల్పులు జరిపారు. సిడ్నీ సమీపంలో ఉన్న ఇండియన్ ఈటర్ యాన్ అనే రెస్టారెంట్ పైన దుండగుడు ఈ కాల్పులకు తెకబడ్డాడు.

రెస్టారెంట్ రద్దీగా ఉన్న సమయంలో కిటికీలో నుంచి కాల్పులు జరిపాడు. ఇటీవలి కాలంలో భారతీయులే లక్ష్యంగా దాడి జరగడం ఇది రెండోసారి. నీలి రంగు దుస్తులు ధరించి వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపి, అక్కడి నుంచి పారిపోయాడు.

ఈ ఘటన జరిగినప్పుడు రెస్టారెంటులో దాదాపు నలభై మంది ఉన్నారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఏమీ కాలేదు. ఈ సంఘటన రాత్రి తొమ్మిది గంటల సమయంలో జరిగిందని పోలీసులు చెప్పారు.

Gunman fires shot through front window of Billu's Indian restaurant

ఈ ఘటనలో ఎవ్వరూ గాయపడలేదు. ఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరన్న విషయాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

అతను కాల్పులు జరిపి పారిపోయే సమయంలో విగ్రామ్ వీధి వద్ద ఓ మహిళను తోసుకుంటూ పారిపోయాడు. అతనిని ఆ మహిళ చూసి ఉంటుందని భావిస్తున్న పోలీసులు, ఆమె నుంచి వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. కాల్పుల ఘటన సమయంలో 30 నుంచి 40 మంది వరకు స్టాఫ్, కస్టమర్లు ఉన్నారని పోలీసులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+