డేరాబాబాకు మరో ఎదురుదెబ్బ, రూ.30 లక్షలు కట్టాల్సిందేనన్న హైకోర్టు!
డేరా సచ్ఛా సౌదా ఛీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా గుర్మీత్ దాఖలు చేసిన పిటిషన్ ను పంజాబ్ హర్యానా హైకోర్టు కొట్టివేసింది. పంచకుల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం డేరాబాబ
చండీగఢ్: డేరా సచ్ఛా సౌదా ఛీఫ్, సాధ్వీలపై అత్యాచారం కేసులో ఇప్పటికే 20 ఏళ్లు జైలుశిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా గుర్మీత్ దాఖలు చేసిన పిటిషన్ ను పంజాబ్ హర్యానా హైకోర్టు కొట్టివేసింది.
పంచకుల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం డేరాబాబాకు 20 ఏళ్ల జైలుశిక్షతోపాటు రూ.30 లక్షలు జరిమానా కూడా విధించింది. ఆ డబ్బు బాధిత సాధ్వీలకు ఇవ్వాలని సూచించింది. డేరాబాబా ఏ అభ్యర్థనకూ పంచకుల కోర్టు అంగీకరించలేదు.

దీంతో ఆయన చండీగఢ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పంచకుల కోర్టు తనకు విధించిన రూ. 30 లక్షలు జరిమానా కట్టేందుకు గుర్మీత్ నిరాకరించారు. తాను సమస్తం పరిత్యాగం చేశాననీ.. అంత డబ్బు తన వద్ద లేదంటూ పంజాబ్-హర్యానా కోర్టుకు నివేదించారు.
డబ్బులు కట్టలేకపోవడానికి కారణమేంటని ధర్మాసనం ప్రశ్నించగా... ''డేరా సంస్థకు చెందిన ఆస్తులన్నిటినీ జప్తు చేశారు. అందువల్ల ఆయన రూ. 30 లక్షల జరిమానా చెల్లించే పరిస్థితుల్లో లేరు..'' అని డేరాబాబా తరపున వాదిస్తున్న లాయర్ సమాధానమిచ్చారు.
అయితే ఈ వాదనను కొట్టిపారేసిన ధర్మాసనం... రెండు నెలల్లోగా పంచకుల కోర్టుకు రూ.30 లక్షల జరిమాన చెల్లించాలంటూ ఆదేశించింది. ఈ మొత్తాన్ని అత్యాచార బాధితులకు చెల్లిస్తారు.
మరోవైపు డేరాబాబాకి 20 ఏళ్ల జైలు శిక్ష సరిపోదనీ.. యావజ్జీవ కారాగార శిక్ష విధించాలంటూ బాధితులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు వారు దాఖలు చేసిన అప్పీలును కూడా పంజాబ్ హర్యానా హైకోర్టు విచారణకు స్వీకరించింది.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications