భారతీయులకు ట్రంప్ షాక్: సంచలన ప్రకటన

అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టబోయే డోనాల్డ్ ట్రంప్ భారతీయులకు మరోసారి షాక్ ఇచ్చారు. ఇక్కడికి వచ్చి అమెరిన్ల ఉద్యోగాలు కొల్లగొట్టేవారిని సహించబోమని ఆయన హెచ్చరించారు.

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించినున్న డోనాల్డ్ ట్రంప్‌ భారతీయులకు భారీ షాక్‌ ఇచ్చారు. హెచ్‌1బీ వీసాలపై అమెరికాకు వచ్చి అమెరికన్ల ఉపాధిని దెబ్బతీయడాన్ని తాను సహించబోనని మరోసారి హెచ్చరించారు. ఇదే విషయాన్ని ఎన్నికల ప్రచారంలో కూడా ప్రస్తావించారు. ఆ తర్వాత కాస్తా చల్లడినట్లు కనిపించినా మరోసారి తన అసలు స్వరూపాన్ని బయటపెట్టుకున్నారు.

అమెరికాలో వివిధ కంపెనీల్లో హెచ్1బీ వీసాలపైనే భారతీయులు పెద్ద యెత్తున పనిచేస్తున్నారు. గురువారం అయోవాలో తన మద్దతుదారులతో జరిగిన సమావేశంలో ఇదే విషయాన్ని ట్రంప్‌ మరోసారి ప్రస్తావించారు. ప్రచారం సమయంలో తాను ఎంతో మంది అమెరికన్లను కలిశానని, వారి ఉద్యోగాలు పోవడంతో తప్పనిసరిగా కొత్తవారికి శిక్షణ ఇవ్వాల్సి వచ్చిందని, వారి స్థానాల్లో విదేశీయుల్ని తీసుకున్నట్లు తెలిసిందని ట్రంప్‌ చెప్పారు.

H1B visas holders will not be allowed to displace American workers: Trump

మన ఉద్యోగాలను తీసేసి మన స్థానంలో తీసుకున్నవారికి శిక్షణ ఇస్తేనే కానీ మనకివ్వాల్సిన జీతం మొత్తం ఇవ్వబోమని బెదిరించడం ఎంతో దారుణమని ఆయన అన్నారు. అమెరికన్ల హక్కుల్ని కాపాడడానికి తాను చివరి వరకు పోరాడతానని, డిస్నీ సహా ఇతర కంపెనీల్లో ఈ వీసాలపై వచ్చి వారి ఉపాధిని దెబ్బతీయడాన్ని తాను అనుమతించనని స్పష్టంచేశారు.

డిస్నీ వరల్డ్, ఇతర కంపెనీలకు చెందిన కేసులను కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. డిస్నీ వరల్డ్‌, మరో రెండు ఔట్‌ సోర్సింగ్‌ కంపెనీలపై ఇద్దరు మాజీ ఉద్యోగులు కేసులు పెట్టారు. హెచ్‌1 బి వీసాల మీద తక్కువ జీతానికి విదేశీ కార్మికులను తెచ్చుకుని తమ ఉద్యోగాలను తీసేశారని ఆరోపిస్తూ వారు న్యాయస్థానానికి వెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+