మక్కాలో సైతాన్‌పై రాళ్లు: తొక్కిసలాటలో 717 మంది మృతి, ఎలా? (వీడియో)

హజ్: హజ్ యాత్రలో రెండోసారి భారీ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వంద మందికి పైగా మృతి చెందారు. సమాచారం మేరకు 717 మంది వరకు మృతి చెందినట్లుగా తెలుస్తోంది.

సౌదీ అరేబియా సివిల్స్ డిఫెన్స్ అధికారులు మాట్లాడుతూ... 717 మంది భక్తులు మృతి చెందారని, 850 మంది వరకు గాయపడ్డారని చెప్పారు. మినా వద్ద ఈ తొక్కిసలాట జరిగిందని చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

మక్కాకు సమీపంలో మినా ఉంది. హజ్ యాత్రలో భక్తులు చివరగా.. మీనా ప్రాంతంలో సైతాన్ పైన రాళ్లు విసురుతుంటారు. ఇక్కడకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ఆ సమయంలో తొక్కిసలాట జరిగింది.

కాగా, పదిహేను రోజుల వ్యవధిలో ఇది రెండో భారీ ప్రమాదం. ఇటీవల క్రేన్ కూలి 107 మంది మృతి చెందారు. సెప్టెంబర్ 12వ తేదీన క్రేన్ కూలింది. ముస్లింలకు పవిత్ర క్షేత్రమైన మక్కాలోని మసీదు (గ్రాండ్‌ మాస్క్‌)లో భారీ క్రేన్ కూలిపోవడంతో 107 మంది మరణించారు.

దాదాపు 200 మంది గాయపడ్డారు. శుక్రవారం మక్కాలో వీచిన పెను గాలులకు నిర్మాణ పనులకోసం ఏర్పాటు చేసిన భారీ క్రేన్‌ కూలిపోయింది. మసీదు పైభాగాన్ని చీల్చుకుంటూ క్రేన్ నేలకొరిగింది.

క్రేన్‌ విరుచుకుపడటంతో మసీదు పైకప్పుకు పెద్ద రంధ్రం పడింది. క్రేన్‌ భాగాలు పైనుంచి కిందికి వేలాడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో షేర్‌ అయ్యాయి. సహాయ సిబ్బంది, వైద్యులు హుటాహుటిన సంఘటన స్థలానికి తరలివెళ్లారు.

Hajj: 100 dead and 390 injured in Mina stampede

తొక్కిసలాట ఎలా?

మక్కాలో పెను తొక్కిసలాట జరిగి పెద్ద ఎత్తున మృతి చెందారు. శుక్రవారం బక్రీద్ పర్వదినం ఉండటం, హజ్ యాత్ర కొనసాగుతుండటంతో లక్షల సంఖ్యలో ముస్లిం యాత్రికులు మక్కాకు చేరుకున్నారు. వీరిలో అత్యధికులు సైతానుపై రాళ్లు విసిరి, తమ యాత్రను ముగించుకునేందుకు వచ్చారు.

వస్తున్న యాత్రికుల సంఖ్య, కాబా సమీపంలో ఉన్న స్థలం వివరాలు అంచనా వేయడంలో అధికారులు సైతం విఫలమయ్యారు. యాత్రికులు విసిరిన కొన్ని రాళ్లు ఇతరులపై పడటంతో తొక్కిసలాట మొదలైనట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా అందరూ బయటకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఈ తొక్కిసలాట జరిగింది.

ఇప్పటికే హజ్ యాత్ర కోసం భారత్ నుంచి వేల సంఖ్యలో ప్రజలు మక్కాకు చేరుకుని ఉండటం, మృతుల వివరాలు ఇంకా వెల్లడి కాకపోవడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నట్టు సౌదీ సర్కారు వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+