వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్ రిపోర్ట్స్ : అమెరికాలో భయోత్పాతం.. టీనేజర్లు,యువకులనూ వదలని కరోనా..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ అమెరికాలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు 54,916 మందికి వైరస్ సోకగా.. 784 మంది మృత్యువాతపడ్డారు. వైరస్ సోకినవారిలో కేవలం 379 మంది మాత్రమే కోలుకున్నారు. గత మంగళవారం నాటికి అమెరికాలో కేవలం 6300 పాజిటివ్ కేసులు నమోదవగా.. 100 మంది మృతి చెందారు. వారం గడిచిందో లేదో.. పాజిటివ్ కేసులు దాదాపు 10 రెట్లు పెరిగాయి. మృతుల సంఖ్య కూడా 10 రెట్లు పెరిగింది.అత్యధికంగా న్యూయార్క్ నగరంలో 26,438 పాజిటివ్ కేసులు నమోదవగా.. 271 మంది మృత్యువాతపడ్డారు. న్యూజెర్సీలో 3,675 మందికి వైరస్ సోకగా 44 మంది మృత్యువాతపడ్డారు. కాలిఫోర్నియాలో 2617 మందికి వైరస్ సోకగా.. 55 మంది మృత్యువాతపడ్డారు.

టీనేజర్లు,యువకులకు కూడా కరోనా వైరస్..

టీనేజర్లు,యువకులకు కూడా కరోనా వైరస్..

ఆందోళన కలిగించే విషయమేంటంటే.. న్యూయార్క్‌లో నమోదైన 15వేల పాజిటివ్ కేసుల్లో ఎక్కువమంది 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల లోపువారే. కాలిఫోర్నియాలోనూ ఇదే పరిస్థితి. అక్కడ నమోదైన 2617 పాజిటివ్ కేసుల్లో సగం కేసులు 18 ఏళ్ల నుంచి 49 ఏళ్ల వారివే. కాలిఫోర్నియా గవర్నర్ గెవిన్ న్యూసొమ్ ఈ విషయాన్ని వెల్లడించారు. కాలిఫోర్నియాలో నమోదైన కేసులను పరిశీలిస్తే.. 0-17 ఏళ్ల వయసు వారిలో 28 పాజిటివ్ కేసులు, 18-49 ఏళ్ల వయసువారిలో 970 కేసులు,50-64 వయసువారిలో 493 కేసులు,65 పైబడ్డవారిలో 449 కేసులు,ఇంకా గుర్తించనివి 162 కేసులు నమోదయ్యాయి.ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు వెల్లడైన కథనాల్లో కరోనా వైరస్ ఎక్కువగా 60 ఏళ్ల పైబడిన వారి పైనే ప్రభావం చూపుతుందని తేలింది. కానీ కాలిఫోర్నియాలో పరిస్థితి చూస్తుంటే.. ఆ వాదనలో పూర్తి నిజం లేదని అర్థమవుతోంది. అక్కడ నమోదైన కేసుల్లో వృద్దుల కంటే టీనేజర్లు,మధ్య వయస్కులే ఎక్కువగా ఉన్నారు.

అమెరికాలో వేగంగా విస్తరిస్తోన్న వైరస్

అమెరికాలో వేగంగా విస్తరిస్తోన్న వైరస్

అమెరికాలో లూసియానా వంటి రాష్ట్రాల్లో మార్చి మధ్య వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా 1000 కేసులు నమోదయ్యాయి.ఇప్పటివరకు అక్కడ మొత్తం 1388 కేసులు నమోదవగా 46 మంది మృతి చెందారు. దీంతో లూసియానా గవర్నర్ జాన్ బెల్ ఎడ్వర్డ్స్ ఫెడరల్ మేజర్ డిజాస్టర్‌గా ప్రకటించాలని అధ్యక్షుడు ట్రంప్‌కి విజ్ఞప్తి చేశారు. న్యూయార్క్,వాషింగ్టన్ మినహా అమెరికాలో లూసియానాలోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయని తెలిపారు.

ఆందోళనలో అమెరికా

ఆందోళనలో అమెరికా

మిచిగాన్‌లో గత వారం 65 మాత్రమే ఉన్న కేసుల సంఖ్య మంగళవారం(మార్చి 24) నాటికి 1791కి చేరింది. ఇందులో 15 మంది మృత్యువాతపడ్డారు. పెన్సిల్వేనియాలో రాత్రికే రాత్రే 200 పైచిలుకు కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 851కి పెరిగింది. ఇందులో ఏడుగురు మృత్యువాతపడ్డారు. అటు ఫ్లోరిడాలో 1461 కేసులు,జార్జియాలో 1097 కేసులు నమోదయ్యాయి. మొత్తం మీద అమెరికాలో భయానక వాతావరణమే కనిపిస్తోంది. కేసుల సంఖ్య వేగంగా విస్తరిస్తుండటంతో టీనేజర్లు,యువకులకు కూడా వైరస్ సోకుతుండటంతో అమెరికా తీవ్ర ఆందోళన చెందుతోంది.

English summary
Governor Gavin Newsom said half of those who have tested positive for coronavirus in California are people between the ages of 18 and 49.“Young people can and will be impacted by this virus,” Newsom said in a press conference Tuesday. “In fact, young people disproportionately are the ones testing positive in the state of California.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X