హవాయి గజగజ, అగ్నిపర్వతం బద్దలు: ఎగిసిపడుతున్న లావా, బిక్కుబిక్కుమంటూ ప్రజలు

పహోవా: అమెరికాలోని హవాయి రాష్ట్రంలోని కిలోవా అగ్నిపర్వతం గురువారం బద్దలైంది. బూడిద, పొగతోపాటు లావాను ఎగజిమ్ముతోంది. పర్వతం నుంచి వెలువడిన లావా సమీప గ్రామాల వైపు ప్రవహించింది. లావా ప్రవాహం నేపథ్యంలో వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గ్రామాలను ఖాళీ చేసి వెళ్లాలని ఆదేశించారు.

అగ్నిపర్వతం నుంచి దాదాపు 100 నుంచి 200 అడుగుల వరకు ఎత్తుకు లావా బయటకు చిమ్ముతోంది. దాదాపు 31 ఇళ్లు ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న లావా చాలాదూరం వరకు ప్రవహిస్తుండంతో మంటలు చెలరేగుతున్నాయి. ప్రమాదకర వాయువులు కూడా వెలువడుతున్నాయి.

ఎగిసిపడుతున్న లావా

ఎగిసిపడుతున్న లావా

అగ్నిపర్వతం సమీపంలోని లైలానీ ఎస్టేట్స్ సబ్ డివిజన్ ప్రాంతంలో ఇండ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎరియల్ సర్వే ద్వారా ధ్వంసమైన ఇళ్లను, ప్రాంతాలను గుర్తించారు. అగ్నిపర్వతం బద్దలైన అనంతరం వరుస భూకంపాలతో ఆ ప్రాంతం కంపించిపోయింది. లావా ఎగిసిపడుతోంది. మరికొన్ని రోజులు ఇలాగే ఉండనుంది.

అత్యంత వేగంగా బయటకు వస్తోన్న లావా

అత్యంత వేగంగా బయటకు వస్తోన్న లావా

అత్యంత వేగంగా లావా బయటకు వస్తోందని అధికారులు చెప్పారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. దాదాపు నాలుగు లక్షల చదరపు మీటర్ల ప్రాంతం వరకు లావా విస్తరించింది. కిలోవా అగ్ని పర్వతం గత 35 ఏళ్లుగా పలుమార్లు బద్ధలై లావా వెదజల్లుతోంది. 1700 మందిని ప్రమాదక ప్రాంతం నుంచి తరలించారు.

 వందలాది చిన్న భూకంపాలు

వందలాది చిన్న భూకంపాలు

లావా ప్రవాహం ఎప్పుడు తగ్గుతుందో, మాకు ఈ సమస్య ఎప్పుడు తప్పుతుందో తెలియదని టోడ్ కోరీగాన్ అనే స్థానికుడు అన్నారు. హవాయి అధికారులు ఆదివారం మరో రెండు విస్ఫోటనాలు గుర్తించారు. దీంతో గురువారం నుంచి మొత్తం 9 విస్ఫోటనాలను గుర్తించారు. గురువారం నుంచి వందలాది చిన్న భూకంపాలు వచ్చాయి. ఓ భూకంపం 6.9 మాగ్నిట్యూడ్ తీవ్రతతోను భూకంపం వచ్చింది. గత నలభై ఏళ్లలో ఇదే అతిపెద్ద భూకంపం.

 ప్రమాదకర వాయువులు

ప్రమాదకర వాయువులు

భూకంపాలు సంభవిస్తుండటం వల్ల పెద్ద ఎత్తున సల్ఫర్ డై యాక్సైడ్ వాతావరణంలోకి విడుదల అవుతోంది. ఈ వాయువును పీల్చడం వల్ల ప్రాణాలు కోల్పోయే అవకాశముంది. ముక్కు, గొంతులో తీవ్రంగా మంట వచ్చి శ్వాస తీసుకోలేక మనిషి ఇబ్బందిపడవచ్చు. ద్వీపాల్లో అతి భా భూకంపాలు సంభవించినప్పుడు సునామీలు వస్తుంటాయి. హవాయీకి ఆ ముప్పేమీ లేదని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+