మోడీకి ఎలాన్ మస్క్ గిఫ్ట్ ఏంటో తెలుసా ?
అమెరికా పర్యటనలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ తర్వాత స్పేస్ ఎక్స్ సీఈవో కమ్ అమెరికా ప్రభుత్వ సమర్ధత విభాగం డాగ్ కు బాస్ కు కూడా ఉన్న ఎలాన్ మస్క్ ను భారత ప్రధాని మోడీ కలిశారు. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక అంశాలపై ఆయనతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అయితే ఇందులో భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఎలాన్ మస్క్ ఓ గిఫ్ట్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అసలే అంతరిక్ష పరిశోధనల్లో దూకుడు ప్రదర్శిస్తున్న భారత్ కు మస్క్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా ?
It was also a delight to meet Mr. @elonmusk’s family and to talk about a wide range of subjects! pic.twitter.com/0WTEqBaVpT
— Narendra Modi (@narendramodi) February 13, 2025
ఎలాన్ మస్క్ తో భేటీలో ప్రధాని నరేంద్ర మోడీ..ఆవిష్కరణ, అంతరిక్ష పరిశోధన, కృత్రిమ మేధస్సు, స్థిరమైన అభివృద్ధితో సహా పలు కీలక రంగాలలో భారత్, అమెరికా సంస్ధల మధ్య సహకారం బలోపేతం చేయడంపై చర్చించారు. అలాగే అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, వ్యవస్థాపకత, సుపరిపాలనలో సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి ఉన్న అవకాశాలను కూడా చర్చించుకున్నారు. ఇందులోనే ఇప్పటికే అంతరిక్షంలో ఉన్న తన స్టార్ షిప్ కు వాడిన ఓ సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్ కు ఇచ్చేందుకు మస్క్ అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై త్వరలో ప్రకటన రానుంది.

Had a very good meeting with @elonmusk in Washington DC. We discussed various issues, including those he is passionate about such as space, mobility, technology and innovation. I talked about India’s efforts towards reform and furthering ‘Minimum Government, Maximum Governance.’ pic.twitter.com/7xNEqnxERZ
— Narendra Modi (@narendramodi) February 13, 2025
ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ స్టార్‌షిప్ హీట్‌షీల్డ్ టైల్స్ వాతావరణంలోకి తిరిగి వచ్చేటప్పుడు దాన్ని రక్షించడానికి వీలుగా రూపొందించారు. షట్కోణంలో ఉండే సిరామిక్ టైల్స్ అంతరిక్ష నౌక భూమికి తిరిగి వచ్చినప్పుడు తీవ్ర ఉష్ణోగ్రతలను తట్టుకుంటుంది. సిలికా-ఆధారిత సిరామిక్‌తో తయారు చేసిన ఈ టైల్స్ స్పేస్ షటిల్ టైల్స్‌ను పోలి ఉంటాయి. అంతకంటే బలమైనది, మరింత వేడి-నిరోధకతను ఇది కలిగి ఉంటుందని తెలుస్తోంది. లోపలవైపు నౌకను చల్లగా కూడా ఉంచుతాయి.
దీన్ని ఇప్పుడు భారత్ కు ఇచ్చేందుకు మస్క్ అంగీకరించినట్లు సమాచారం. భారత్ లో శాటిలైట్ ఇంటర్నెట్‌కు సంబంధించిన రెగ్యులేటరీ విషయాలపై ప్రత్యేకంగా స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్ సేవలపై జరిగిన చర్చల నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. భారత్ లో శాటిలైట్ ఇంటర్నెట్ కోసం మస్క్ ఇప్పుడు రిలయన్స్ జియోతో పోటీ పడుతున్నారు.












Click it and Unblock the Notifications