పోర్న్ వీడియోలో తనను తానే చూసుకున్న యువకుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
సాధారణంగా ఏదైనా అశ్లీల వీడియో చూసేటప్పుడు వినోదం కోసం చూస్తారు. కానీ ఓ యువకుడికి మాత్రం అది తన జీవితంలోనే అతిపెద్ద పీడకలగా మారింది. ఆన్‌లైన్లో అసభ్యకర వీడియోలు చూస్తుండగా.. ఓ వీడియోలో తానే స్వయంగా కనిపించడంతో సదరు యువకుడు దిగ్భ్రాంతికి గురయ్యాడు.
అసలేం జరిగిందంటే?
హాంకాంగ్‌కు చెందిన ఓ యువకుడు 2023లో తన ప్రియురాలితో కలిసి చైనాలోని షెన్‌జెన్‌లోని ఓ హోటల్లో బస చేశాడు. కొన్ని వారాల తర్వాత ఆ యువకుడు ఎరిక్ ఓ అడల్ట్ వెబ్‌సైట్‌ను చూస్తుండగా ఓ వీడియో అతడిని ఆకర్షించింది. అందులో ఉన్న గది, వారు తెచ్చిన బ్యాగులు, చివరకు అందులో ఉన్న వ్యక్తులు తానే, తన ప్రియురాలు ఎమిలీ అని గుర్తించడానికి అతనికి ఎంతో సమయం పట్టలేదు.

రహస్య కెమెరాల ఉచ్చు
వీరు హోటల్‌లో గడిపిన ప్రైవేట్ క్షణాలను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు గదిలో రహస్య కెమెరా అమర్చి రికార్డ్ చేశారు. దాదాపు గంటసేపు ఉన్న ఈ ఫుటేజీని వారి అనుమతి లేకుండా ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేశారు. వేలాది మంది ఆ వీడియోను అప్పటికే వీక్షించారు. "నాకు సాధారణ పోర్న్ కంటే ఇలాంటి రహస్య కెమెరా వీడియోలు సహజంగా ఉంటాయని ఇష్టపడేవాడిని. కానీ అందులో నేనే కనిపిస్తానని కలగన్నైనా అనుకోలేదు" అని ఎరిక్ ఆవేదన వ్యక్తం చేశాడు.
దెబ్బతిన్న మానసిక స్థితి
ఈ విషయం తెలిసిన ఎమిలీ తీవ్ర భయాందోళనకు గురైంది. తన స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు ఆ వీడియో చూసి ఉంటారేమోనని ఆమె ఆందోళన చెందింది. ఈ ఘటన తర్వాత వారిద్దరి మధ్య మాటలు తగ్గిపోయాయి. ప్రస్తుతం వారు బయటకు వెళ్తే టోపీలు ధరిస్తున్నారని, హోటళ్లకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారని సమాచారం.
చైనాలో స్పైక్యామ్ ముప్పు
చైనాలో పోర్న్ తయారు చేయడం, షేర్ చేయడం చట్టవిరుద్ధం అయినప్పటికీ.. గత పదేళ్లుగా ఈ రహస్య కెమెరా దందా జోరుగా సాగుతోంది.హోటల్ యజమానులు ప్రతిరోజూ గదులను తనిఖీ చేయాలని ప్రభుత్వం నిబంధనలు తెచ్చినప్పటికీ, ప్రయోజనం కనిపించడం లేదు. బీబీసీ పరిశోధన ప్రకారం, చైనాలోని వివిధ హోటల్ గదుల్లో దాదాపు 180కి పైగా రహస్య కెమెరాలు బయటపడ్డాయి. ఈ ఘటన కేవలం చైనాకే పరిమితం కాదు. మనం ఏదైనా హోటల్ గదికి వెళ్ళినప్పుడు, అక్కడ ఉన్న విద్యుత్ ఉపకరణాలు, అద్దాలు, ఇతర వస్తువులను జాగ్రత్తగా పరిశీలించడం అత్యవసరం.












Click it and Unblock the Notifications