భారత్ తో తెగని జంఝాటం: పాకిస్తాన్ పీఎంను భోజనానికి పిలిచిన ట్రంప్: వైట్ హౌస్ లో క్లోజ్డ్ డోర్ మీటింగ్

పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్.. వైట్ హౌస్ లో అడుగు పెట్టనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు ఆ దేశ పర్యటన చేప్టటిన ఆయన వైట్ హౌస్ లో ద్వైపాక్షిక సమావేశాలకు హాజరు కానున్నారు. ట్రంప్ ఇచ్చే విందులో పాల్గొనున్నారు. ఇది క్లోజ్డ్ డోర్ మీటింగ్. ఈ మేరకు వైట్‌హౌస్ అధికారిక షెడ్యూల్ ను విడుదల చేసింది. భారత్- అమెరికా మధ్య విభేదాలు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్.. పాకిస్తాన్ పీఎంకు విందు ఇవ్వబోతోండటం చర్చనీయాంశమైంది.

ఐక్యరాజ్యసమితి 80వ సర్వసభ్య సమావేశాల్లో పాల్గొనడానికి షెహబాజ్ షరీఫ్ ప్రస్తుతం అమెరికా వెళ్లారు. సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. దీని తర్వాత ఆయన స్వదేశానికి తిరుగుముఖం పట్టాల్సి ఉంది. అనూహ్యంగా డొనాల్డ్ ట్రంప్ నుంచి ఆహ్వానం అందిందాయనకు. దీంతో న్యూయార్క్ నుండి నేరుగా వాషింగ్టన్ చేరుకుంటారు. డొనాల్డ్ ట్రంప్ తో ద్వైపాక్షిక సమావేశాలకు పాల్గొంటారు. అక్కడే ఆయన ఇచ్చే విందుకు హాజరవుతారు.

High-Stakes Meeting Trump Welcomes Pakistan s PM to the White House

మొత్తంగా ట్రంప్ ఎనిమిది ఇస్లామిక్-అరబ్ దేశాల నాయకులతో డొనాల్డ్ ట్రంప్ సమావేశం కానున్నారు. షరీఫ్‌తో సమావేశానికి ముందు ట్రంప్ కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేస్తారు. ఇందులో టిక్‌టాక్ భద్రతా ఒప్పందాన్ని ఖరారు చేసే ఒప్పందం కూడా ఉందని వైట్ హౌస్ చెబుతోంది.

రెండోసారి అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. పాకిస్తాన్ తో సంబంధాలను మెరుగుపర్చుకుంటోన్న విషయం తెలిసిందే. గతంలో ఆ దేశ సైన్యాధ్యక్షుడు అసీమ్ మునీర్ నూ వైట్ హౌస్ కు ఆహ్వానించారు ట్రంప్. ఆయనకు విందు ఇచ్చారు. క్లోజ్డ్ డోర్ మీటింగ్ నిర్వహించారు. ఇప్పుడు తాజాగా షెహబాజ్ షరీఫ్ తోనూ భేటీ కాబోతోన్నారు. ఆసియాలో చైనా ప్రభావాన్ని ఎదుర్కొనడానికి అమెరికా సుదీర్ఘకాలం పాటు భారత్‌పై ఆధారపడుతూ వచ్చింది.. ఇప్పుడది రివర్స్ అయింది.

ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ను మరింత చేరదీస్తోన్నారు డొనాల్డ్ ట్రంప్. భారత్- పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి ట్రంప్ కృషి చేసినట్లు పాకిస్థాన్ ఒప్పుకోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు. ఆయన పేరును నోబెల్ శాంతి బహుమతికి సిఫారసు చేయడానికీ అంగీకరించింది. భారత్.. ఆ పని చేయలేకపోయింది. ఈ ప్రతిపాదనలను నిర్ద్వందంగా తోసిపుచ్చింది. పాకిస్తాన్ తో యుద్ధాన్ని నివారించడంలో ట్రంప్ పాత్ర లేదని కూడా తేల్చి చెప్పింది. అదే సమయంలో రష్యాతో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడం వంటి పరిణామాలు అమెరికాతో దూరాన్ని పెంచాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+