భారత్‌ను అంటావా, నోర్మూసుకో: ట్రంప్ పైన హిల్లరీ

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసులో డెమోక్రటిక్ పార్టీ తరఫున ముందున్న హిల్లరీ క్లింటన్ ప్రచార టీం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పైన నిప్పులు చెరిగారు. భారత్ లాంటి దేశాల పైన విమర్శలు చేయడం సరికాదని, అది ఆయన అహంకారానికి నిదర్శనం అని వ్యాఖ్యానించారు.

కొన్ని మతాలు, జాతులను కించపరిచేలా మాట్లాడటం మానుకోవాలన్నారు. అమెరికాలో ఉన్న భారతీయులను టార్గెట్ చేసుకొని ట్రంప్ వ్యాఖ్యానించడం ఇతర దేశస్థుల పైన అతడికి ఉన్న అభిప్రాయాన్ని సూచిస్తుందని హిల్లరీ క్లింటన్ ప్రచారానికి సారథ్యం వహిస్తున్న జాన్ పొడెస్టా అన్నారు.

Hillary Clinton's campaign slams Donald Trump for mocking Indians

ఓ ప్రచార ర్యాలీలో డొనాల్డ్ ట్రంప్.. ఇండియన్ కాల్ సెంటర్ వర్కర్ల‌ను అవహేళన చేసేలా ఇటీవల మాట్లాడిన విషయం తెలిసిందే. దీనిపై క్లింటన్ ప్రచారం టీం నిప్పులు చెరిగింది. విదేశీయులపై తప్పుడు ఆరోపణలు చేయడం కన్నా కళ్లు నోరు మూసుకుని ఉండాలని హితవు పలికారు.

ట్రంప్ వ్యాఖ్యలు దేశానికే ప్రమాదమని, ఆయన ప్రచారం ప్రపంచవ్యాప్తంగా అమెరికా పట్ల అమెరికన్ల పట్ల ద్వేష భావానికి బీజాలు నాటుతున్నాయన్నారు. విదేశాల పైన అనసవర మాటల బదులు నోర్మూసుకోవడం మంచిదన్నారు. కాగా, ఇటీవల తన ప్రచార సభలో కాల్ సెంటర్లోని ఇండియన్ ఉద్యోగి ఇలా మాట్లాడుతాడంటూ ఎద్దేవా చేసిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+